Teenmaar Mallanna Q news office raided again by CCS police తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై మళ్లీ దాడులు..

Teenmaar mallanna q news office raided again by ccs police

Teenmaar Mallanna, Arrest, chikadpally police, Astrologer, Lakshmikant Sharma, Blackmailing, Hyderabad Police,Q News Office, Police Raids, CM KCR, Srinivas Goud, Corruption, Telangana Rashtra Samithi, TRS social media convenor Krishank, Youtube channel, Cybercrime police, Telanagana, politics, Crime

Popular political activist and journalist Chintapandu Naveen Kumar alias Teenmaar Mallanna Q news office had been raided again by the Hyderabad Cyber Crime Police for the Third time. Police had seized his 10 computers 15 Hard disks.

తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై మళ్లీ దాడులు..

Posted: 09/07/2021 11:19 AM IST
Teenmaar mallanna q news office raided again by ccs police

తీన్మార్ మల్లన్నగా  తెలంగాణ ప్రజలకు సుపరిచుతుడైన ప్రముఖ జర్నలిస్ట్.. అలియాస్ చింతపండు నవీన్‌ కు చెందిన యూట్యూబ్ చానెల్ క్యూ న్యూస్ కార్యాలయంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇవాళ మరోమారు దాడులు నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన కొద్దిపాటి మెజారిటీతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూసిన తరుణంలో ఆయనను అధికార పార్టీ టార్గెట్ చేసి అరెస్టు చేసిందన్న అరోపణలు వెలువెత్తిన విషయం తెలిసిందే.

డబ్బుల కోసం తీన్మార్ మల్లన అలియాస్ చింతపండు నవీన్.. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్‌శర్మ ఏప్రిల్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.30 లక్షలు కావాలని మల్లన్న తనను బెదిరిస్తున్నాడని, ఇవ్వకుంటే తన చానల్ లో తప్పుడు కథనాలు ప్రచారం చేసి తన ప్రతీష్టకు భంగం కలిగిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని లక్ష్మీకాంత్‌శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో కొత్తగా అంబర్ పేట్ శంకర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇద్దరి మధ్య తాను రాజీ కుదర్చిన మాట నిజమేనని ఆయన అంగీకరించారని సమాచారం.  

ఈ క్రమంలో క్యూ న్యూస్‌ కార్యాలయంలో సీసీఎస్‌ పోలీసులు మరోమారు సోదాలు నిర్వహించారు. ఆయన కార్యాలయంపై దాడులు చేయడం వరుసగా ఇది మూడో సారి. కార్యాలయంలోని 10 కంప్యూటర్లు, 15 హర్డ్‌ డిస్క్‌లు, కేబుల్‌ పత్రాలు, పుస్తకాలు తీసుకెళ్లినట్లు సమాచారం. గత నెల 27 నుంచి తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌ చంచలగూడ జైలులో ఉన్నారు. పీర్జాదిగూడ కెనరానగర్‌ సమీపంలోని ప్రజా క్లినిక్‌ నిర్వాహకుడు డాక్టర్‌ ఇమ్మానేయల్ ను పోలీసులు విచారించారు. మల్లన్నకు గతంలో కరోనా సోకగా ఈ వైద్యుడి వద్ద చికిత్స పొందినట్లు తెలియడంతో ఆయన్ను పోలీసులు రహస్యంగా విచారించి వైద్యం వివరాలు సేకరించినట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles