Touching Minor's Cheeks is Not Sexual Assault: HC బుగ్గులు నిమరడాన్ని లైంగికదాడి అనలేం: బాంబే హైకోర్టు

Touching minor s cheeks is not sexual assault says bombay high court

Bombay High Court, posco, chicken seller, touching cheeks, sexual intent, sexual assault

The Bombay High Court observed that touching cheeks without a sexual intent would not attract the offence of “sexual assault” under the Pocso Act. The court granted bail regarding the case to a 46-year-old chicken seller who spent 13 months in jail.

కామవాంఛ లేని చర్యలను లైంగికదాడిగా పరిగణించలేం: బాంబే హైకోర్టు

Posted: 08/30/2021 06:53 PM IST
Touching minor s cheeks is not sexual assault says bombay high court

మైనర్ బాలికల బుగ్గలను నిమరడం.. లేదా తాడకంపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కామ వాంఛ లేకుండా బాలిక బుగ్గలు తాకడాన్ని లైంగిక దాడిగా పరిగణించబోమని స్పష్టం చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్-7 కూడా ఇదే విషయాన్ని చెబుతోందని జస్టిస్ సందీప్ షిండే ఏకసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. చిన్నారుల బుగ్గలను నిమరడం లాంటి చర్యలను లైంగిక దాడిగా పరిగణించలమేని న్యాయస్థానం అభిప్రాయపడింది. మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న అభియోగాలతో గత 13 నెలలుగా జ్యుడీషియల్ రిమాండ్ లో వున్న వ్యక్తికి బెయిలు మంజూరు చేస్తూ ఊరటను కల్పించింది.

నిందితుడు తరుపు న్యాయవాది వాదనలను విన్న న్యాయస్థానం.. కేవలం బెయిలు మంజూరు చేసేందుకు మాత్రమే తమ వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకుంటామని, ఇది ఏ రకంగానూ కేసు ట్రయల్ లో ప్రభావితం చూపవని న్యాయస్థానం పేర్కోంది. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన తర్వాత నిందితుడు లైంగిక వాంఛతో బుగ్గలు తాకినట్టు అనిపించలేదని పేర్కొన్న ధర్మాసనం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహమ్మద్ అహ్మద్ ఉల్లా (46)కు బెయిలు మంజూరు చేసింది.

కేసు వివరాల్లోకి వెళ్తే.. థానేలో చికెన్ దుకాణం నిర్వహిస్తున్న అహ్మద్ ఉల్లా ఎనిమిదేళ్ల చిన్నారిని తన దుకాణానికి పిలిచి బుగ్గను తాకి చొక్కా విప్పాడని, ఆ తర్వాత ప్యాంటు కూడా విప్పబోతుంటే అదే సమయంలో అక్కడికి వెళ్లిన మరో మహిళ గుర్తించి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మహిళ ఫిర్యాదుతో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు తజోలా జైలులో ఉన్నాడు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, తాను నిరపరాధినని ఉల్లా వాదించాడు. వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడికి బెయిలు మంజూరు చేశారు. కాగా ఈ వ్యాఖ్యలు కేవలం బెయిలు పిటీషన్ వరకు మాత్రమే పరిమితమని, కేసు ట్రయల్ విషయంలో తమ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపబోవని కూడా పేర్కోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bombay High Court  posco  chicken seller  touching cheeks  sexual intent  sexual assault  

Other Articles