Don't be afraid: TV anchor forced to praise Taliban తాలిబన్ల తుపాకుల మధ్య.. భయంతో ‘‘భయపడకండీ’’ అని చెప్పిన యాంకర్..

Don t be scared afghan tv anchor relays taliban message surrounded by armed fighters

Taliban, press, TV studio, news anchor, news reader, news journalitst, armed men studio, viral video afghaistan, Afghan Tv, Taliban, Afghanistan, Journalists, Afghan journalists, Taliban news, Afghanistan news

Don't be afraid. These were the words of a visibly frightened news anchor in Afghanistan with armed men standing behind him in the studio. The video of the incident has gone viral with questions being raised on the Taliban's promise of a free press.

ITEMVIDEOS: తాలిబన్ల తుపాకుల మధ్య.. భయంతో ‘‘భయపడకండీ’’ అని చెప్పిన యాంకర్..

Posted: 08/30/2021 06:00 PM IST
Don t be scared afghan tv anchor relays taliban message surrounded by armed fighters

ప్రజలారా భయపడకండీ.. ఇలాంటి విసత్కర పరిస్థితుల్లో మేము మీకు అండగా వుంటాం.. ఇలా సర్వసాధారణంగా ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబించినప్పుడు వారికి మనోధైర్యం కల్పించేందుకు విపక్షాలు చెప్పే మాట. కానీ ఇక్కడ ఈ టీవీ న్యూస్ రీడర్ చెబుతున్నాడు. ప్రజలారా భయపడకండీ.. దేశాన్ని వీడి వెళ్లకండీ.. తాలిబన్ల పాలనలో మనం సురక్షితంగానే వుంటాం. అని అంటున్నారు. తాలిబన్ పేరు వినగానే అప్ఘన్ ప్రజలు తమ అస్తులు, అంతస్థులు వదిలి దేశం వీడి మరో దేశానికి వెళ్లి తలదాచుకుంటామని కాబుల్ లోని విమానాశ్రయానికి వేల సంఖ్యలో చేరుకుంటున్న సమయంలో జర్నలిస్టు ఇలా చెబుతున్నారేంటా అని ఆశ్చర్యపోతున్నారా,?

ఇలా చెప్పాడంటే జర్నలిస్టు తాలిబన్ సానుకూల వ్యక్తి అయ్యివుండాలి.. లేదా టీవీ ఛానెల్ యాజమాన్యమైనా తాలిబన్ సానుభూతిపరుడై వుండాలని భావిస్తున్నారా.? కానీ ఇది ఎంతమాత్రం కాదు. అయితే ఇలా చెప్పడంటే.. అందుకు కారణం ప్రాణభయం కావచ్చు. స్వతహాగా ‘భయపెట్టడం’ అన్నది తాలిబన్ల నైజం. భయపడకుంటే కాల్చిపారేయడం ఇదే వారి క్రూరత్వం. అలాంటి వారు ఓ పది మంది తుపాకులు పట్టుకుని మన చుట్టూ చేరితే..! ఓ జర్నలిస్ట్ కు ఇదే అనుభవం ఎదురైంది. ఓ వార్తా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ ను వారు భయపెట్టి.. భయపడొద్దంటూ ఆఫ్ఘన్లకు చెప్పించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

ఓ ఎనమిది మంది సాయుధ తాలిబన్లు ఆ యాంకర్ చుట్టూ ఉండగా.. ‘ఆఫ్ఘన్లెవరూ తాలిబన్లను చూసి భయపడొద్దు. ఇస్లామిక్ ఎమిరేట్ అంటే భయం వద్దు’ అని లైవ్ లో చెప్పాడు. భయపడొద్దు అని చెప్పేప్పుడు అతడి మాటల్లో భయం కనిపించడం గమనార్హం. దానికి సంబంధించిన వీడియోను ఇరాన్ కు చెందిన మాసీ అలీనాజాద్ అనే మహిళా జర్నలిస్టు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. పత్రికా స్వేచ్ఛను కాపాడుతామని చెప్పిన తాలిబన్లు.. బెదిరింపుల పర్వం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతోంది. ఇటీవల టోలోన్యూస్ కు చెందిన జర్నలిస్టును, కెమెరామ్యాన్ ను తాలిబన్లు చితకబాదారు.. వారి బంధువుల ఇళ్లలోకి చొరబడి సోదాలు చేశారు. కాబూల్, జలాలాబాద్ లలో జర్నలిస్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పత్రికా స్వేచ్ఛ ఎక్కడుందని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles