young man sets police chowki on fire to get jailed ఠాణాకు నిప్పుపెట్టిన యువకుడు.. ఎందుకో తెలిసా.?

Fed up with wife s behaviour young man sets police chowki on fire to get jailed

Devji Chavda, man fedup of wife, man sets police chowki on fire, man jail food, Bajrang Wadi police chowki, Jamnagar Road, Rajkot, Gujarat, Crime, Gujarat crime, man sets police chowki on fire, Gujarat crime, Gujarat crime news, Gujarat news, rajkot crime, guajart police

A 23-year-old man allegedly set a police chowki in Gujarat's Rajkot on fire on Monday, with the intention to get arrested, as he was fed up with the behaviour of his wife who subjected him to lengthy and aggressive lectures over domestic issues. The man saw jail as the place where he would at least get food to eat.

జైలుకు వెళ్లాలని పోలీస్ స్టేషన్ కు నిప్పు.. ఎందుకో తెలిసా.?

Posted: 08/30/2021 07:55 PM IST
Fed up with wife s behaviour young man sets police chowki on fire to get jailed

విసిగి వేసారిన వ్య‌క్తి.. ఎందుకనో ఏ సంబంధం లేకుండా ఏకంగా పోలీసు స్టేషన్ ను తగులబెట్టాడు. పోలీసు ఠాణా అగ్నికి ఆహుతవుతుంటూ అక్కడే నిల్చుని వేడుక చూశాడే తప్ప.. మంటలను కూడా అర్పే ప్రయత్నం చేయలేదు. స్థానిక వ్యాపారులు, పౌరులు స్పందించి మంటలను అర్పినా.. ఆ యువకుడు మాత్రం అక్కడే నిలబడ్డాడు. పోలీసులు వస్తున్నారన్న సమచారం అందుకున్నా తరువాత.. కూడా వారి జీపు హారన్ వినిపిస్తున్నా.. ఏ మాత్రం జంకు, బొంకు, బెదురు లేకుండా అక్కడే నిల్చున్నాడు. వెంటనే పోలీసులు వచ్చి నిప్పుపెట్టిన యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

విచారణ సందర్భంగా యువకుడ్ని ఎందుకిలా చేశావ్ అని అడ్డగానే అతను చెప్పిన సమాధానం విని పోలీసులు నివ్వెరపోయారు.కొందరు పోలీసులైతే.. ఔరా ఇంత లేత వయస్సులో ఎంత కష్టం వచ్చిందిరా.. బాబు అంటూ ఓదార్చారు కూడా. మరికొందరు ఔన్రా బాబు.. ఈ ఆడవాళ్లు వున్నారే.. అంటూ అతడికి మద్దతు పలికారు. అదేంటి ఆడవారికి.. యువకుడు పోలిస్ స్టేషన్ కు నిప్పుపెట్టడానికి గల కారణాలేంటి.. అంటూ అలోచనలో పడ్డారా..? అక్కడికే వస్తున్నాం. తన భార్య ప్రవర్తనతో విసుగు చెందిన యువకుడు.. అమె నుంచి తప్పించుకున్నా వేళకు బోజనం పెట్టే ప్రాంతమేదా అని అలోచించాడు.

వెంటనే జైలుకు వెళితే క‌నీసం తిండి దొరుకుతుంద‌నే ఆశ‌తో నేరానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ లోని రాజ్ కోట్ లో  వెలుగుచూసింది. అయిన‌దానికీ, కానిదానికీ భార్య లెక్చ‌ర్లు ఇస్తుండ‌టంతో విసిగిన వ్య‌క్తి జైలుకు వెళ్లినా న‌య‌మ‌నే ఆలోచ‌న‌తో రాజ్‌కోట్‌లోని పోలీస్ చౌకికీ నిప్పంటించి చోద్యం చూశాడు. నిందితుడిని న‌గ‌రంలోని జామ్‌న‌గ‌ర్ రోడ్డులోని బ‌జ్‌రంగ్ వాడికి చెందిన దేవ్జీ చ‌వ్దాగా గుర్తించారు. దిన‌స‌రి కూలీగా ప‌నిచేసే దేవ్జీ ఆదివారం సాయంత్రం త‌న ఇంటి ఎదురుగా ఉన్న పోలీస్ చౌకీ వద్ద‌కు వెళ్లి దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

మంట‌ల‌ను గుర్తించిన స్ధానిక వ్యాపారులు అక్క‌డికి వెళ్ల‌గా నిందితుడు ఘ‌ట‌నా ప్రాంతంలోనే నిల్చుని ఉన్నాడు. మంట‌ల‌ను అదుపు చేసిన వ్యాపారులు, స్ధానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. నిందితుడు పారిపోకుండా అక్క‌డే ఉండ‌టంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌గా షాకింగ్ వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. పోలీస్ చౌకీకి నిప్పంటించిన స‌మ‌యంలో అది మూసివేసి ఉండ‌టంతో ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles