Best chief minister: On a slippery slope ఇండియాటుడే బెస్ట్ సీఎం సర్వే లో మనవాళ్లు కనిపించరేం.!

Narendra modi s popularity fell from 66 to 24 in one year india today survey

India today, Mood of the nation, Yogi Adityanath, stalin, TamilNadu, Naveen Paatnaik, Odisha, Mamata Banerjee, West Bengal, best chief minister, CM KCR, CM YS Jagan, Andhra pradesh, Telangana, Narendra Modi news, PM modi, India Today survey, Yogi Adityanath, India Prime Minister, Rahul Gandhi, Covid-19, modi popularity

Uttar Pradesh chief minister Yogi Adityanath, who faces an assembly election in barely six months has emerged as India’s best-performing chief minister in the August 2021 Mood of the Nation (MOTN) survey, with a significant decline in popularity--from 25 per cent to 19 per cent now. PM Modi’s popularity rating has dropped from 66% to 24% in one year.

ఇండియాటుడే బెస్ట్ సీఎం సర్వే లో మనవాళ్లు కనిపించరేం.!

Posted: 08/18/2021 02:43 PM IST
Narendra modi s popularity fell from 66 to 24 in one year india today survey

ఒక్క ఏడాదిలో ప్రధాని మంత్రి నరేంద్రమోది గ్రాఫ్ పూర్తిగా దిగజారిపోయింది. గత ఏడాది 66 శాతంగా వున్న ఆయన పాపులారిటీ ఈ ఏడాది తాజాగా విడుదలైన సర్వేలో ఏకంగా 24కు దిగజారింది. ఏడాది వ్యవధిలో ఆయన పాపులారిటీ గ్రాప్ ఏకంగా 42 శాతం కోల్పోయింది. కరోనా మహమ్మారి రెండో దశ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో పాటు కరోనా లాంటి కఠోర సమయాల్లోనూ ఆయన ప్రభుత్వం పేదలపై భారం మోపుతూ ఇంధన ధరలతో పాటు సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో జాతీయ స్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రి 19 శాతం ఓట్లతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దాస్ అగ్రస్థానంలో నిలిచారు. అయితే, యోగీ అదిత్యనాథ్ పాపులారిటీ గ్రాప్ కూడా ఆరు మాసాల వ్యవధిలో ఆరుశాతం మేర దిగజారింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఆయన పాపులారిటీ కూడా తగ్గింది. జనవరిలో నిర్వహించిన మూడ్ అప్ ది నేషన్ లో 25 శాతం మేర వున్న ఆయన పాపులారిటీ కాస్తా తాజా సర్వే సమయానికి 19 శాతానికి పరిమితం అయ్యింది.

ఇక యోగి అధిత్యనాథ్ తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 14 శాతం ఓట్లతో రెండోస్థానంలో, 11 శాతం ప్రజాదరణతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మూడో స్థానంలో నిలిచారు. ఇక గతేడాది నిర్వహించిన ఇదే సర్వేలో ‘బెస్ట్ సీఎం’గా నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ ఈసారి పడిపోయింది. బోల్డన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి ఆయనకు సరైన ఆదరణ లభించకపోవడం గమనార్హం. ఇక, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను స్వరాష్ట్ర ప్రజలు బెస్ట్ సీఎం అంటూ కీర్తించారు. ఆ రాష్ట్రంలో 42 శాతం మంది ఆయనకు ఓట్లేసి అగ్రస్థానాన్ని కట్టబెట్టారు.

అలాగే స్వరాష్ట్రంలో ప్రజాదరణలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (38శాతం), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (35శాతం) రెండు మూడు స్థానాల్లో నిలిచారు. ‘మోస్ట్ పాప్యులర్ సీఎమ్స్ ఇన్ దెయిర్ హోమ్ స్టేట్స్’ టాప్-10 జాబితాలో కూడా ఏపీ సీఎం జగన్ పేరు కనిపించలేదు.  టాప్-10 జాబితాను మాత్రమే వెల్లడించడంతో జగన్ స్థానం ఎంతన్నది తెలియరాలేదు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా టాప్ టెన్ జాబితాలో లేదు. మరోవైపు, జాతీయ స్థాయిలోనూ జగన్‌కు ఆదరణ తగ్గినట్టు ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో వెల్లడైంది.

గతేడాది ఇదే సర్వేలో జాతీయ స్థాయిలో జగన్ బెస్ట్ సీఎం అంటూ 11 శాతం మంది ఓట్లేయగా, ఈసారి ఆ సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. ఆరు శాతం మంది మాత్రమే ఆయనకు అనుకూలంగా ఓట్లేశారు. ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో భాగంగా  19 రాష్ట్రాల పరిధిలో 115 లోక్‌సభ నియోజకవర్గాలు, 230 అసెంబ్లీ స్థానాల్లో గత నెల 10-20 తేదీల మధ్య ఈ సర్వే నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తంగా 14,599 మంది అభిప్రాయాలు సేకరించారు. వీరిలో 71 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, 29 శాతం మంది పట్టణ ప్రాంతాలకు చెందినవారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles