Auto Scrapping Policy Will Boost Vehicle Sales: Gadkari ఫిట్ నెస్ ఫెయిల్.. స్క్రాప్ యార్డుకు వాహనం: గడ్కరీ

Vehicle scrappage policy to speed up economic growth says nitin gadkari

National Automobile Scrappage Policy, Vehicle Scrapping Policy India, Nitin Gadkari, state government, GST, Union Minister Nitin Gadkari, National, Politics

The National Automobile Scrappage Policy unveiled on Friday will benefit all stakeholders as it will boost manufacturing, create jobs and help both the Centre as well as state governments in earning up to ₹ 40,000 crore each in GST, Union Road Transport and Highways Minister Nitin Gadkari said.

నూతన స్ర్కాప్ ఫాలసీ: ఫిట్ నెస్ ఫెయిల్.. వాహనం తుక్కే: గడ్కరీ

Posted: 08/18/2021 03:31 PM IST
Vehicle scrappage policy to speed up economic growth says nitin gadkari

ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమయ్యే వాహనం ఇకపై స్ర్కాప్ యార్డుకు తరలుతుంది. సర్లే తరువాత తీసుకెళ్తాం అనే అవకాశం కూడా వాహనదారుడికి ఆర్టీఏ అధికారులు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే నూతన స్ర్కాపేజీ విధానం ప్రకారం మూడు పర్యాయాలు ఫిట్ నెస్ పరీక్షల్లో వాహనం ఫెయిల్ అయితే వెంటనే దానిని తుక్కుగా మార్చేస్తారు. ఈ మేరకు కేంద్రం కార్యాచరణ మొదలుపెట్టింది. 1 ఏప్రిల్ 2023 నుంచి వాణిజ్య వాహనాలు, 1 జూన్ 2024 నుంచి వ్యక్తిగత వాహనాలకు ఇది వర్తిస్తుంది. కొత్త విధానంలో భాగంగా వాహనాలన్నీ తప్పనిసరిగా ఫిట్‌నెస్ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో కనుక విఫలమైతే వాహనాలను తుక్కు కింద మార్చేస్తారు.

ఈ మేరకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు. ఫిట్‌నెస్ పరీక్షలో కనుక వాహనాలు విఫలమైతే నెల రోజుల్లోపు మరో అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత కూడా విఫలమైతే వారం రోజుల్లోపు అప్పీలు చేసుకోవచ్చు. అక్కడ కూడా ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమైతే నమోదిత కేంద్రంలో వాహనాన్ని తుక్కు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో 15 ఏళ్ల సర్వీసు పూర్తయిన వాహనాలు కోటికిపైనే. వీటిని తుక్కు చేయడమే కొత్త విధానం ఉద్దేశం. వాటి స్థానంలో కొత్త వాహనాలు వస్తే భద్రత పెరగడంతోపాటు ఇంధనం, నిర్వహణ ఖర్చులు ఆదా అవుతాయి.

అంతేకాకుండా ఈ విధానం వల్ల కొత్తగా 35 వేల ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఇక కొత్త విధానంలో కొన్ని ప్రోత్సాహకాలను కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత వాహనం రిజిస్టర్డ్ స్క్రాపింగ్ సెంటర్‌కు వెళ్తే వాహన యజమానికి డిపాజిట్ ధ్రువపత్రం లభిస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు దానిని చూపిస్తే రిజిస్ట్రేషన్ రుసుము నుంచి మినహాయింపు లభిస్తుంది. వ్యక్తిగత వాహనాలకైతే రోడ్డు ట్యాక్స్‌పై 25 శాతం, వాణిజ్య వాహనాలకు 15 శాతం రాయితీ లభిస్తుంది. వాణిజ్య వాహనాలకు 8 సంవత్సరాల వరకు, వ్యక్తిగత వాహనాలకు 15 ఏళ్ల వరకు ఈ రాయితీ లభిస్తుంది. ప్రతి జిల్లాలోను ఓ తుక్కు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles