Last Hindu priest refuses to flee Afghanistan ‘‘తాలిబన్లు చంపినా.. సేవగా గుర్తిస్తాను’’ అప్ఘనిస్తాన్ లో హిందూ పూజారీ

If taliban kills me i consider it my seva says last hindu priest in afghanistan

Afghanistan, Afghanistan latest news, hindus in afghanistan, hindu temple in afghanistan, Taliban, Taliban latest news, Kabul, kabul latest news, Kabul Airport, pandit rajesh kumar, rattan nath temple Afghanistan, Afghanistan latest news, hindus in afghanistan, hindu temple in afghanistan, taliban, taliban latest news, kabul, kabul latest news, kabul airport, pandit rajesh kumar, rattan nath temple, Devotional

With chaos unfolding in Kabul, thousands of people are fleeing Afghanistan, fearful of what lies ahead in the second Taliban regime. Heart-wrenching visuals from the airport in the capital city show people crowding airplanes leaving the war-torn country.

‘‘తాలిబన్లు చంపినా.. సేవగా గుర్తిస్తాను’’ అప్ఘనిస్తాన్ లో హిందూ పూజారీ

Posted: 08/18/2021 12:49 PM IST
If taliban kills me i consider it my seva says last hindu priest in afghanistan

ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబర్లు తమ కబంధ హస్తాలలోకి తీసుకోవడంతో.. దేశప్రముఖులు, నాయకులు, ఇతర మతాలవారు అనేక మంది దేశాన్ని వీడారు. ఇక ఇదే సమయంలో దేశంలో తమ ఆడబిడ్డలకు భద్రత లేదని కూడా అనేక మంది అప్ఘనిస్తాన్ ఫౌరులు దేశాన్ని వీడి ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాలిబన్ ఉగ్రవాదులు దేశపౌరులపై తుపాకులను గురిపెట్టి వారి ప్రాణాలను తీస్తున్న ఘటనలు కూడా నమోదయ్యాయి. ఈ విపత్కర సమయంలో అఫ్ఘనిస్తాన్ లోని సిక్కులు, హిందువులుతో పాటు అందరూ దేశాన్ని వీడారు.

ఇలాంటి సమయంలో కూడా ఆఫ్ఘనిస్థాన్ దాటి రావడానికి ఒక హిందూ పూజారి ససేమిరా అంటున్నాడు. ఆయన పేరు పండిట్ రాజేష్ కుమార్. ఇక్కడి రత్తన్ నాథ్ ఆలయంలో ఆ కుటుంబం తరతరాలుగా పూజారులుగా పనిచేస్తున్నారట. తన పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆలయాన్ని వదిలి తాను రావడం జరగదని రాజేష్ కుమార్ స్పష్టం చేశారు. కొంతమంది హిందువులు ఆయన్ను దేశం దాటించి, సాయం చేస్తామని చెప్పినా ఆయన నిరాకరించారట.

‘‘వందల ఏళ్లుగా మా పూర్వీకులు ఈ ఆలయంలో సేవ చేస్తున్నారు. కొందరు హిందువులు కాబూల్ వదిలి వెళ్లిపొమ్మన్నారు. వేరే చోటకు వెళ్లడానికి, అక్కడ ఉండటానికి సాయం చేస్తామని అన్నారు. కానీ ఈ ఆలయం మా వంశపారంపర్యంగా వస్తోంది. మేం ఇక్కడ వందల ఏళ్లుగా సేవలు చేస్తున్నాం. అలాంటి ఆలయాన్ని నేను వదల్లేను. తాలిబన్లు గనుక నన్ను చంపేస్తే అది కూడా ఆలయానికి నా సేవగానే భావిస్తా’’ అని రాజేష్ బదులిచ్చారట.

ఈ పూజారి కథను భరద్వాజ్ అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ కథనంతోపాటు ఆ ఆలయానికి సంబంధించిన పాత వీడియోను కూడా షేర్ చేశారు. ఇతరుల దృష్టి ఆకర్షించకుండా ఉండటం కోసం రత్తన్ నాథ్ ఆలయం ఇల్లులాగే ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాజేష్ కుమార్ కథ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దేశంలోని హిందువులు ఆయన కథను విని చలించిపోతున్నారు. ఆయనకు ఆ భగవంతుడే శ్రీరామరక్షగా నిలవాలని కొందరు ప్రార్థనలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles