Shashi Tharoor in soup over ‘Malayali Taliban’ tweet తాలిబన్లలో మలయాళీలు ఉన్నారన్న శశిథరూర్..

Taliban terrorists peak malayalam shashi tharoor shares a video on twitter

Taliban, AFGHANISTAN CRISIS, Taliban-Afghanistan Crisis, unrest, conflicts and war, Lok Sabha MP, Shashi Tharoor, Malayalee terrorists

Senior Congress leader and Lok Sabha MP, Shashi Tharoor, shared a video on Twitter in which two Taliban terrorists appeared speaking Malayalam. Tharoor opined that It indicated the presence of Malayalees among the Taliban militants. A word spoken by a Taliban insurgent sounds like the Malayalam word ‘samsarikkette’. Tharoor wrote on twitter.

తాలిబన్లలో మలయాళీలు ఉన్నారన్న శశిథరూర్.. వివాదాస్పదమైన ట్వీట్

Posted: 08/17/2021 07:54 PM IST
Taliban terrorists peak malayalam shashi tharoor shares a video on twitter

దేశానికి చెందిన పలు రాష్ట్రాల యువత ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదం పట్ల ఆకర్షితులై.. అందులో చేరడానికి ప్రయత్నించగా, భారత బలగాలు వారిని విమానాశ్రయాలలో అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే కొందరు మాత్రం అనేక మార్గల్లో అన్వేషణ సాగించి ఇస్లామిక్ స్టేట్ లో చేరారు. ఇందులో కొందరు అక్కడి దౌర్భగ్య, దుర్మార్గ పరిస్థితిని ఇమడలేక తిరిగి స్వదేశానికి తిరిగిరాగా, కొందరు మాత్రం అందులో కొనసాగుతున్న వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అలాంటి అనుమానాస్పద ట్వీట్ చేశారు.

ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు వశం చేసుకున్న తర్వాత కాబూల్ శివార్లలో జరిగిన ఒక ఘటనలో అక్కడకు చేరుకున్న కొందరు తాలిబన్ ఉగ్రవాదులలో ఒకడు తాము విజయం సాధించామనే ఆనందంలో నేలపై కూర్చొని ఆనందబాష్పాలు రాల్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. దీన్ని చూసిన శశిథరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తాలిబన్లలో కనీసం ఇద్దరు మలయాళీలు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే వీడియోలో ఒకడు ‘సంసరికెట్టె’ అన్నాడని, దాన్ని మరొకడు అర్థం చేసుకున్నాడని శశిథరూర్ విశ్లేషించారు. అయితే ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. తాలిబన్లతో మలయాళీలను ముడిపెట్టడం సరికాదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

కేరళను తాలిబన్ ఉగ్రవాదులతో ముడిపెట్టడం సరికాదని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఈ విషయంలో బీజేపీ నేత వినీత్ గోయెంకా కూడా స్పందించారు. ఇదేమీ కామెడీ షో కాదంటూ శశిథరూర్‌కు కౌంటర్ ఇచ్చిన ఆయన.. కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి స్యూడో సెక్యులరిజాన్ని వ్యాపింపచేస్తున్నాయని విమర్శించారు. తను ఇటీవల రాసిన 'ఎనిమీస్ వితిన్' పుస్తకంలో కేరళ ఎలా ఇస్లామిక్ ఉగ్రవాదుల హాట్‌స్పాట్‌గా మారుతుందనే అంశాన్ని వివరించానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles