mixing vaccine is a bad idea: Cyrus Poonawalla కరోనా డెల్టా వేరియంట్ పై ప్రపంచ అరోగ్యసంస్థ కీలక ప్రకటన

Delta variant to soon become dominant strain worldwide who

delta variant, coronavirus, who funding, covid vaccination, covaxin, covishield, covaxin, covishield, cocktail, mixing vaccine, covaxin covishield mixing, covid vaccines mixing, icmr, india covid 19 vaccines, safe, more immune to covid variants, coronavirus, Covid-19

The highly transmissible Delta variant of the coronavirus would soon become the dominant strain worldwide, the World Health Organisation (WHO) has said. The surge in the cases of Delta variant has increased the urgency for the vaccination of the vulnerable group, WHO said.

కరోనా డెల్టా వేరియంట్ పై ప్రపంచ అరోగ్యసంస్థ కీలక ప్రకటన

Posted: 08/17/2021 06:43 PM IST
Delta variant to soon become dominant strain worldwide who

కరోనా వైరస్‌ మహమ్మారి క్రమంగా రూపాంతరం చెందుతూ ప్రపంచంపై తన ప్రభావాన్ని చాటుతొంది. భారత్ లో తొలిగా వెలుగుచేసిన కరోనా డెల్టా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. కరోనా డెల్టా వేరియంట్ అతివేగంగా వ్యాప్తిస్తూ..  అగ్రరాజ్యం అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో విలయ తాండవం సృష్టిస్తోంది. ఈ క్రమంలో డెల్టా వేరియంట్ పై కీలకమైన ప్రకటన చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. గతంలోని వేరియంట్ల కన్నా ఇది చాలా వేగంగా ప్రబలుతోందని

ప్రస్తుతం ప్రపంచంలో నాలుగు వేరియంట్లు ప్రమాదకరంగా ఉండగా, అతి త్వరలో డెల్టా వేరియంట్ ఈ జాబితాలో తొలిస్థానానికి చేరుతుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. డెల్టా కేసులు పెరగడం వల్ల పలు దేశాల్లో ఆక్సిజన్ అవసరాలు పెరుగుతున్నాయని చెప్పింది. ముఖ్యంగా తక్కువ, మధ్యస్థ ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల్లో పరిస్థితులు అంత బాగాలేవని తెలిపింది. ఈ వేరియంట్‌ను నియంత్రించడం కోసమైనా ప్రపంచంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది.

ఇదే క్రమంలో 7.7 బిలియన్ డాలర్ల ప్రతిపాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ర్యాపిడ్ ఏసీటీ-ఆక్సిలరేటర్ డెల్టా రెస్పాన్స్ (రాడార్)గా పిలిచే ఈ పథకాన్ని వచ్చే నాలుగు నెలల్లో ఆమోదించాలని డబ్ల్యూహెచ్‌వో కోరింది. ఈ ఆమోదం లభిస్తే కరోనా టెస్టులు చేసే సామర్థ్యాన్ని పెంచడంతోపాటు భవిష్యత్తులో వచ్చే మరిన్ని కొత్త వేరియంట్లను ముందుగానే గుర్తించవచ్చని ఈ సంస్థ పేర్కొంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి మరింత ఆక్సిజన్ అందించవచ్చని, ఆరోగ్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందించడం కుదురుతుందని తెలిపింది.

ఈ రాడార్ పథకం కొత్తదేమీ కాదని, ఏసీటీ-ఆక్సిలరేటర్‌కు ప్రతిపాదించిన మొత్తం 2021 బడ్జెట్‌లో భాగమని చెప్పింది. 2020 మొత్తంలో నమోదైన కరోనా కేసుల కన్నా 2021 తొలి 5 నెలల్లోనే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగు కరోనా వేరియంట్లు ప్రబలుతున్నాయని, అయితే వీటికన్నా ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు ఇంకా పుట్టుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delta variant  coronavirus  who funding  covid vaccination  covaxin  covishield  coronavirus  Covid-19  

Other Articles