TTD Shares Good News with Devotees over Sampradaya Bhojanam తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ‘సంప్రదాయ భోజనం’.!

Ttd board shares good news to tirumala srivari devotees over sampradaya bhojanam

Tirumala SriVari Devotees, Tirumala Balaji, Tirupati Venkateswara swamy,Tirumala devotees, Tirumala Tirupati Devasthanam, TTD Board, Sampradaya Bhojanam, cow, KS Jawahar Reddy, Turumala Executive Officer, devotees lunch programme, Andhra Pradesh, crime

Tirumala Tirupati Devasthanam Board shares good news with Srivari Devotees over Sampradaya Bhojanam, which will be in implimentation in a month.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ‘సంప్రదాయ భోజనం’.!

Posted: 08/16/2021 01:23 PM IST
Ttd board shares good news to tirumala srivari devotees over sampradaya bhojanam

కలియుగ వైకుంఠధామంగా భక్తుల కోంగుబంగారంగా నిలిచే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులు ఎప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అసంఖ్యాక భక్తులలో పెద్దభాగం మాత్రం పేద భక్తులదే. వీరిలో అనేక మంది తిరుమలలో శ్రీవారి ప్రసాదంగా భావించే అన్నప్రసాదానికి అరగిస్తారు. అయితే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు చక్కని శుభవార్తను అందజేసింది. తిరుమలలో ఇన్నాళ్లు పెడుతున్న బోజనంలోనూ సమూల మార్పులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. ఇదివరకే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించే బ్యాగుల విషయంలోనూ కాలుష్యరహిత బ్యాగులను అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ.. ఇకపై భక్తుల భోజనం విషయంలోనూ చక్కని మార్పును అమల్లోకి తీసుకురానుంది.

తిరుమలలో మరో నెల రోజుల్లో ‘సంప్రదాయ భోజనం’ అందుబాటులోకి రానుంది. గో ఆధారిత సాగు ద్వారా పండించిన సరుకులతో ఈ సంప్రదాయ భోజనాన్ని తయారు చేస్తారు. తిరుమల అన్నప్రసాద కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిన్న తిరుమల, తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమాల్లో వేర్వేరుగా పాల్గొన్న వీరు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు.

అలాగే అన్ని వసతి సముదాయాలు, అతిథి గృహాల్లోని గదుల్లో గీజర్లను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సెప్టెంబరు చివరినాటికల్లా అలిపిరి నడకమార్గాన్ని పూర్తిచేస్తామన్నారు. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ సహకారంతో మరో నాలుగు నెలల్లో పంచగవ్య ఉత్పత్తులైన సబ్బు, షాంపూ, ధూప్‌స్టిక్స్, ఫ్లోర్ క్లీనర్ తదితర 15 రకాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆలయాల్లో వినియోగించే పుష్పాలతో తయారుచేసిన సుగంధ అగరబత్తీలను సెప్టెంబరు తొలి వారం నుంచి భక్తులకు విక్రయించనున్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles