Anand Mahindra message for this wage worker’s employer దినసరి కూలి చూసి స్పందించిన ఆనంద్ మహీంద్రా..

No one should have to do such risky manual labour anand mahindra

Anand Mahindra, Anand Mahindra Twitter, Labourer balancing bricks, Wager workers India, wage worker, Viral, twitter viral video

Anand Mahindra often takes to his official social media account to share interesting news with his 8.4 million followers. On Monday, the businessman yet again used the power of the Internet when he shared a short clip of a wage worker balancing a pile of bricks on his head.

ITEMVIDEOS: దినసరి కూలిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. ట్రోల్ చేసిన నెటిజనులు

Posted: 08/16/2021 12:38 PM IST
No one should have to do such risky manual labour anand mahindra

ప్రముఖ వ్యాపారవేత్త, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా కంపెనీ చైర్మ‌న్.. ఆనంద్ మహీంద్ర.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి చక్కని వీడియోలు, ఫోటోలు లభించినా వెంటనే ఆయన తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో షేర్ చేసి అభిమానులతో పంచుకుంటారు. అంతేకాదు దానిపై ఆయన కామెంట్ కూడా పెడతారు. అలాంటి ఓ వీడియోనే షేర్ చేశారు. తనకు తెలియకుండానే ఓ తప్పు మాట అనేసి విమర్శల పాలవుతున్నారు. తాజాగా కూడా ఆయన స్ఫూర్తిమంతమైన వీడియోనే పోస్ట్ చేశారు. ఓ కూలీ తన తలపై పదుల సంఖ్యలో ఇటుకలను బ్యాలెన్స్ చేసే వీడియోను పెట్టారు. అయితే, దానికి ఆయన పెట్టిన కామెంటే తలనొప్పులు తెచ్చిపెట్టింది.

‘‘ఎవరూ ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయకూడదు. ఎవరితోనూ చేయించకూడదు. అయితే, ఇన్ని ఇటుకలను ఒకేసారి తన తలపై మోస్తూ.. బ్యాలెన్స్ చేస్తున్న అతడి కష్టాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. అయితే కామెంట్ చేసేప్పుడు ఈ వ్యక్తి తరహాలో ఎ వ్యక్తి ఇంత కఠినమైన పని చేయరాదంటూనే.. ఇంతటి కష్టమైన పనిని కూడా ఈ వ్యక్తి కళగా మార్చుకున్నాడంటూ కితాబిచ్చారు. ఇది ఎక్కడ జరిగిందో ఎవరికైనా తెలుసా? అతడి యజమానులు ‘యంత్రాలను (ఆటోమేషన్) వాడుకోలేరా?’ అతడి నైపుణ్యాలను గుర్తించరా?’’ అని పేర్కొంటూ ట్వీట్ చేశారు.

ఆయన ట్వీట్ పై స్పందించిన నెటిజన్లు.. యంత్రాలతో కలిగే నష్టాలేంటో వివరించారు. ఆయన మీదున్న గౌరవంతో కొంచెం సాఫ్ట్ గానే ట్రోల్ చేశారు. ‘‘ఇది చాలా దురదృష్టకరం. ఒకవేళ దీన్నిగానీ ఆటోమేట్ చేస్తే.. ఎలాంటి సాంకేతిక నైపుణ్యాలు లేని ఈ వ్యక్తి ఉపాధి మాటేంటి? అతడి లాగానే ఇలా కూలీ పనులతో బతికే లక్షలాది మంది బతుకుల పరిస్థితేంటి?’’ అని ఓ యూజర్ ప్రశ్నించారు. ఆటోమేషన్ వస్తే లక్షలాది మంది ఉపాధి గల్లంతవుతుందని, ఆటోమేషన్ సురక్షితమైనదైనా ఇలాంటి వారికి వేరే చోట ఎక్కడా ఉపాధి దొరకదని మరో యూజర్ కామెంట్ పెట్టారు. కన్వేయర్ బెల్టులు, హైడ్రాలిక్ లిఫ్టులు పెట్టి తీసుకెళ్లొచ్చు సార్.. వాటిని ఏర్పాటు చేస్తే మరి వీళ్ల తిండి తిప్పల సంగతేంటని మరో యూజర్ ప్రశ్నించారు. ఆటోమేషన్ గొప్ప అని మనం ఆలోచించడం.. చాలా చెడ్డ విషయమని   మరో యూజర్ రాసుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles