Telangana resumes boat service on Krishna river కృష్ణానదిలో జలవిహారాలు షురూ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

Telangana resumes boat service on krishna river to spur water tourism

Hyderabad, water tourism, Water sports, Telangana Government, Srisailam, Somasila, Nagarkurnool, Nagarjuna Sagar, boat services, Krishna waters, Telangana

For lovers of water sports and water tourism, the Telangana government has resumed boat services on the Krishna waters between Srisailam and Somasila in Nagarkurnool and Hyderabad and Nagarjuna sagar on River Krishna in Cruirse Swadesh Darshan project.

కృష్ణానదిలో జలవిహారాలు షురూ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

Posted: 08/16/2021 03:23 PM IST
Telangana resumes boat service on krishna river to spur water tourism

కృష్ణా, గొదావరి నదులు జలకళను సంతరించుకున్నాయి. దీంతొ నిండుకుండలను తలపిస్తున్న ఈ ప్రాజెక్టులలో బోటులో విహరించేందుకు పర్యాటకులు ఉత్సాహాన్ని చేపుతున్నారు. కొత్త నీరు వచ్చి చేరిన ప్రాజెక్టులలో అహ్లాదభరితంగా విహరించేందుకు పర్యాటకుల నుంచి వస్తున్న అమితాసక్తిని గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే జలవిహారం చేసేందుకు అనుమతిని మంజూరు చేయగా, తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణానదిలో సంతరించుకున్న జళకళను పర్యాటకులు వీక్షించేందుకు జల విహారాం చేయడానికి అనుమతిని మంజూరు చేసింది.

దీంతోపాటు పర్యాటకుల కోసం కూడా పలు ప్యాకేజీలను కూడా తీసుకువచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన జలవిహారాలను పునరుద్ధరించాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పర్యాటక ప్యాకేజీలను శనివారం నుంచి పునరుద్ధరించనుంది. ప్రస్తుతం కృష్ణానది నీటిమట్టం లాంచీల ప్రయాణానికి అనుకూలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు. కృష్ణా నదిలో విహారయాత్రలకు సంబంధించి పలు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్-శ్రీశైలం-సోమశిల యాత్రకు ఒక్కొక్కరికి రూ.3,999 చొప్పున వసూలు చేస్తారు. ఇది రెండు రోజుల ప్యాకేజీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు కూడా ఉన్నాయి. రెండో ప్యాకేజీలో హైదరాబాద్-శ్రీశైలం-నాగార్జునసాగర్ యాత్ర. గతంలో ఈ యాత్ర శ్రీశైలం నుంచి సాగర్ వరకు ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ రెండు యాత్రలు ఉదయం ఏడు గంటల సమయంలోనే ప్రారంభం అవుతాయి. ఈ ప్యాకేజీ ధర కూడా రూ. 3,999 మాత్రమే. ప్రతి శనివారం యాత్రలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి వారంలో మూడు ట్రిప్పులు వేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles