mixing vaccine is a bad idea: Cyrus Poonawalla వాక్సీన్ మిక్సింగ్ అధ్యయనంపై సీరం చైర్మన్ సంచలన వ్యాఖ్యలు..

Serum institute s cyrus poonawalla is against mixing of covid vaccines

Cyrus Poonawalla, vaccine, covid, Serum Institute, vaccine mixing, Serum Institute of India, Adar Poonawalla, covaxin, covishield, cocktail, mixing vaccine, covaxin covishield mixing, covid vaccines mixing, coronavirus vaccine mixing, covid vaccine mixing result, icmr, india covid 19 vaccines, safe, more immune to covid variants, coronavirus, Covid-19

Cyrus Poonawalla, chairman of the Serum Institute of India, is opposed to the mixing of Covishield and Covaxin that is currently under proposal. There is no need to mix the doses, Poonawalla said, adding that if something goes wrong then there could be a blame game between the makers of the two vaccines.

వాక్సీన్ మిక్సింగ్ అధ్యయనంపై సీరం చైర్మన్ సంచలన వ్యాఖ్యలు..

Posted: 08/13/2021 07:40 PM IST
Serum institute s cyrus poonawalla is against mixing of covid vaccines

కరోనా వైరస్‌ మహమ్మారి క్రమంగా రూపాంతరం చెందుతూ ప్రపంచంపై తన ప్రభావాన్ని చాటుతున్న తరుణంలో దానిని సమూలంగా అంతం చేయడానికి పరిశోధనలు కోనసాగుతూనే వున్నాయి. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చని అనేక వాక్సీన్లు ప్రజల్లో ప్రతిరక్షకాలను అందిస్తున్నాయి. అయితే కరోనాను అడ్డుకునేందుకు మాత్రం ఇప్పటికీ ఏ టీకా అందుబాటులోకి రాలేదన్న వాదనలూ వున్నాయి. ఈ క్రమంలో పలు దేశాలు అందుబాటులో వున్న టీకాల మిక్సింగ్ కూడా చేసి అధ్యయనం చేస్తున్నారు. ఈ వాక్సీన్ల మిక్సింగ్ ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.  

మన దేశంలోనూ వాక్సీన్ మిక్సింగ్ పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్).. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) పూణే చేసిన అధ్యయనాలు వెల్లడయ్యాయి. దీంతో ఏకంగా వాక్సీన్ మిక్సింగ్ లపై అధ్యయనం చేయాలని డీజీసిఐ కూడా అనుమతులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇది అనాలోచిత ఐడియాగా సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ సైరస్ పూనావాలా అన్నారు. ప్రతిపాదిత కోవీషీల్డ్-కోవాగ్జిన్ మిక్సింగ్ ను ఆయన వ్యతిరేకించారు. డోసులను మిక్స్ లేదా కలపడం చేయాల్సిన అవసరం లేదని పూనావాలా పేర్కొన్నారు.

పూణేలోని తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సైరస్ పూనావాలా వ్యాక్సిన్ల మిక్సింగ్ గురించి మాట్లాడుతూ.. ఒకవేళా ఏదైనా తప్పు జరిగితే.. ఈ రెండు వ్యాక్సిన్ తయారీదారుల మధ్య తుగువులాట వచ్చే అవకాశముందన్నారు. ఏదైనా అనుకోనిది జరిగితే.. ఇతర వ్యాక్సిన్ మంచిది కాదని సీరం సంస్థ అంటదని.. దీంతో ఇతర వ్యాక్సిన్ కంపెనీ.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ లోనే లోపం ఉందంటూ సీరంపై నిందలు వేస్తారు. కాబట్టి వ్యాక్సిన్ లను మిక్స్ చేయడం చాలా తప్పు అని నేను అనుకుంటున్నా అని సైరస్ పూనావాలా అన్నారు. ఫీల్డ్ ట్రయిల్స్ లో వ్యాక్సిన్ మిక్సింగ్ రుజువు అవ్వలేదని తెలిపారు.

కాగా, భారత్ లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్ పై అధ్యయనానికి డీసీజీఐ(భారత ఔషధ నియంత్రణ సంస్థ) రెండు రోజుల క్రితం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూర్ లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ 300 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపైఈ అధ్యయనం నిర్వహించనుంది. ఈ అధ్యయనం యొక్క ఉద్దేశ్యం..వ్యాక్సినేషన్ కోర్సుని పూర్తి చేయడానికి ఒక వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను ఇవ్వగలమా లేదా అని అంచనా వేయడం. కాగా,జులై-29న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కి చెందిన సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ ఈ అధ్యయ నిర్వహణకు రికమండ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : covaxin  covishield  cocktail  mixing vaccine  Cyrus Poonawalla  Adar Poonawalla  coronavirus  Covid-19  

Other Articles