Terror attack alert in Delhi before August 15th ఢిల్లీలో హైఅలర్ట్.. నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్..

Lashkar jaish planning major attacks on august 15 forces on high alert as terrorists set targets

pakistan, independence day, auguts 15, terror attacks, pakistan terror attack, lashkar e taiba, jaish e mohammed, delhi, independence day, Terror attack alert, punjab, jammu and kashmir, border security force, BSF, pulwama, Tarn Taran, Ferozepur, Thehkelan, Amarkot, Drone activity in Jammu Kashmir, drone shot down in Jammu, Pakistan, Terror attack foiled, Jammu Kashmir

According to Delhi Police sources, a big terror alert has been issued on the 75th Independence Day. A high level meeting of top level officers of Delhi Police was held at Red Fort. In this meeting, special guidelines were given to the security agencies regarding a terror alert.

ఢిల్లీలో హైఅలర్ట్.. నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్..

Posted: 08/14/2021 10:54 AM IST
Lashkar jaish planning major attacks on august 15 forces on high alert as terrorists set targets

దేశం స్వాతంత్ర్య దినోత్సవాలను ఎర్రకోటపై ఘనంగా నిర్వహించుకోవాలని ఓ వైపు ఏర్పాట్లు చేస్తుండగా, అదే తరుణంలో పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కరమూకలు ఉగ్రదాడులకు కుట్రపన్నాయి.  దీంతో ఉగ్రవాదులు భారీ కుట్రను చేధించిన పోలీసులు ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశ రాజధానిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున విధ్వంసానికి ఉగ్రవాదులు ప్లాన్ చేశారని నిఘావర్గాల నుంచి సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించి.. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఢిల్లీలో ఉగ్రవాదులు నక్కారన్న సమాచారంతో ఎక్కడికక్కడ నాకాబంధీ పెట్టి తనిఖీలు చేసిన పోలీసులు.. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నక్కిన నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వీరు ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుసుకున్నారు. వీరి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో 55 తుపాకులు, 50 బుల్లెట్ కార్ట్రిడ్జ్ లు ఉన్నాయి. ఈ నలుగురు ఆయుధాల అక్రమ రవాణా ముఠా సభ్యులుగా భావిస్తున్నారు. వీరిని విచారిస్తే కానీ మరిన్ని వివరాలు తెలియదని పోలీసు అధికారులు చెప్పారు.

అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఒకరు ఢిల్లీ వాసి కాగా, మిగిలిన వారు ఉత్తరప్రదేశ్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు సిద్దమౌవుతున్న నేపథ్యంలో నలుగురు ఉగ్రవాదులు పట్టబటడం దేశరాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇక అగస్టు 15వ తేదీని దేశవ్యాప్తంగా డ్రోన్లు, బెలూన్లు ఎగరవేయడంపై ఇప్పటికే భారత ప్రభుత్వం నిషేధం విధించింది. జమ్మూ సహా పలు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ల వ్యవస్థలను పోలీసులు అప్రమత్తం చేశారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చారిత్రక ఎర్రకోట సహా పలు ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles