Mumbai court rejects anticipatory bail to Gehana Vasisth ముంబై హైకొర్టును ఆశ్రయించనున్న సినీనటి గెహనా

Gehana vasisth to move high court after session court rejects her bail plea

raj kundra, shilpa shetty, raj kundra porn case, shilpa shetty husband, porn case, mumbai court, gehana vasisth, gehana vasisth raj kundra, Gehana Vasisht, Mumabi sessions court, Anticipatory Bail, High Court, allegations, porn film case, bollywood, bollywood news

After Mumbai Sessions Court rejection of her anticipatory bail application in the porn films case by saying the allegations against the actor are very serious.. Gehana Vasisth to approach HIgh Court for the same.

హైకొర్టును ఆశ్రయించనున్న సినీనటి గెహనా.. ముందస్తు బెయిల్ పిటీషన్

Posted: 08/13/2021 06:51 PM IST
Gehana vasisth to move high court after session court rejects her bail plea

ప్రముఖ బాలీవుడ్ నటీ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో నిందితురాలిగా ఉన్న సినీనటి గెహనా వశిష్ట్  ముందస్తు బెయిల్ పిటిషన్ ను ముంబై సెషన్స్ కోర్టు  తిరస్కరించింది. అమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. గెహనా వశిష్ట్ పై మోపబడిన అభియోగాలు తీవ్రమైనవని పేర్కొంది. పోలీసు కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. గెహనాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి సరైన ఆధారాలేమి లేవని కోర్టు అభిప్రాయపడింది.

అశ్లీల వీడియోల చిత్రీకరణలో ఫిర్యాదు చేసిన 21ఏళ్ల యువతిని బెదిరించటంలో గెహనా పాత్ర కీలకమని పోలీసులు కోర్టుకు విన్నవించారు. గతంలోనూ ఇలాంటి కేసులోనే తాను అరెస్ట్ అయినట్టు గెహనా కోర్టుకు తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు గెహనా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. ఫిబ్రవరిలో ఇదే కేసులో తనను అరెస్టు చేశారని, జూన్‌లో బెయిల్ మంజూరు చేసినట్లు ఆమె కోర్టుకు తెలిపింది. తనకు సంబంధించిన లాప్‌ట్యాప్‌, ఫోన్‌లను క్రైమ్‌ బ్రాంచ్‌ సీజ్‌ చేసిందని గెహనా పేర్కొంది.

గత ఫిబ్రవరి నెలలో మొదటి సారిగా పోర్నోగ్రఫీ కేసులో గెహనాను ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత గెహనా బెయిల్‌పై విడుదల అయింది . రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో గెహనాపై మరోసారి కేసు నమోదైంది. ఇటీవలే.. పోర్నోగ్రఫీ కేసులో నటి గెహనా వశిష్ట్ ఇన్వాల్వ్ అయిందంటూ మల్వానీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. గెహనా తనను బెదిరించి.. తనతో న్యూడ్, సెమీ న్యూడ్ సీన్ల చిత్రీకరణ చేయిందిందని ఓ బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles