Isro's 'eye in the sky' satellite blasts off but fails to reach orbit జీఎస్ఎల్వీ ఎఫ్10లో సాంకేతిక లోపం.. ప్రయోగం విఫలం.

Isro s eye in the sky satellite fails to reach orbit due to performance anomaly

Indian Space Research Organisation (ISRO), Geosynchronous Satellite Launch Vehicle-F10 (GSLV-F10), Earth Observation Satellite, EOS-03, Satish Dhawan Space Centre (SDSC) SHAR, isro, gslv-f10, gslv-f10 launched, EOS-03, Sriharikota, Andhra Pradesh, ISRO news

The Indian Space Research Organisation (Isro) launched India's "eye in the sky" GISAT-1 Earth observation satellite (EOS) on Thursday, but the mission suffered a setback due to a performance anomaly in the cryogenic stage of the rocket moments after the launch. Isro said that rocket performance was normal in the first and second stages but hit a technical snag in the subsequent phase.

ITEMVIDEOS: ఐ ఇన్ ది స్కై ప్రయోగం విఫలం.. క్రయోజెనిక్ దశలో సాంకేతిక లోపం..

Posted: 08/12/2021 10:36 AM IST
Isro s eye in the sky satellite fails to reach orbit due to performance anomaly

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన జీఎస్‌ఎల్వీ -ఎఫ్‌10 రాకెట్‌ ప్రయోగం అంత్యదశలో విఫలమైంది. రాకెట్ ప్రయోగం సాధారణంగానే చోటుచేసుకున్న తరువాత తొలిరెండు దశలు కూడా విజయవంతంగా పూర్తిచేసుకన్న జీఎస్ఎల్వీ.. ఆ తరువాత ప్లేట్స్ కూడా విజయవంతంగా విడిపోయాయి. ఆ తరువాత క్రయోజనిక్‌ దశలో రాకెట్ లో సమస్య ఎదురైంది. నిర్ధేశిత లక్ష్యం వైపు కాకుండా మరో వైపుకు రాకెట్ దూసుకెళ్లింది. రాకెట్ మార్గం మళ్లించడంతో ఇస్రోలో శాస్త్రవేత్తల ముఖాలలో సంతోషం అవిరైంది. ఎంతో ఘనంగా ఈఓఎస్03 శాటిలైట్ (ఐ ఇన్ ది స్కై)ను నిర్ధేశిత కక్ష్యలో పెట్టాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

ఈ నేపథ్యంలో జీఎస్‌ఎల్‌వీ మిషన్‌ విఫలమైందని ఇస్రో చైర్మన్‌ శివన్‌ వెల్లడించారు. రాకెట్‌ మూడో దశలో సాంకేతిక లోపంతో ప్రయోగం విఫలమైందని తెలిపారు. జీఎల్‌ఎల్‌వీ ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లింది. నెల్లూరులోని శ్రీహరికోటలో సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్‌ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసిన రాకెట్‌ మూడో దశలో విఫలమైనట్లు కంట్రోల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

ఆ తర్వాత మిషన్‌ విఫలమైనట్లు పేర్కొన్నారు. క్రయోజెనిక్ దశలో సమస్యతో ప్రయోగం విజయవంతం కాలేదని మిషన్ కంట్రోల్ సెంటర్‌లోని రేంజ్ ఆపరేషన్ డైరెక్టర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. వాస్తవానికి రాకెట్‌ ప్రయోగం గతేడాది లోనే నిర్వహించాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి, సాంకేతిక సమస్యలతో పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్‌ ద్వారా జీఐశాట్‌-1 ఉపగ్రహాన్ని భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థ, ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టడం, వాటికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇస్రో ఈ మిషన్‌ను చేపట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles