Over 40,000 Vaccinated People Test Positive In Kerala కేరళలో వాక్సీన్ తీసుకున్నా 40 వేల మందికి కరోనా..

Over 40 000 vaccinated people test positive in kerala sources

Coronavirus, COVID-19, Breakthrough infections,Genome sequencing,Covid reinfection,Kerala Covid reinfection, coronavirus cases, Coronavirus Cases india, Coronavirus Cases Maharashtra, Coronavirus Cases Kerala, Corona Deaths, corona vaccine, corona second wave deaths, Kerala, Covid toll, covid deaths in india, covid

More than 40,000 cases contracted the virus after vaccination - have been detected in Kerala. Instances of infection after vaccination elsewhere in the nation and abroad have been rare. The spike in breakthrough infection in the state, which has been suffering a resurgence of the virus, has opened up questions about how the immunity escape is happening, sources said.

కేరళలో వాక్సీన్ తీసుకున్నా 40 వేల మందికి కరోనా.. ఆందోళన

Posted: 08/12/2021 11:25 AM IST
Over 40 000 vaccinated people test positive in kerala sources

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఇంకా కరళానృత్యం చేస్తోంది. తొలిదశలో అందోళన ఎక్కువగా వున్నా.. కేసులు మాత్రం తక్కువగానే నమోదయ్యాయి. కాగా రెండవ దశలో మాత్రం కేసులు అధికంగానే నమోదయ్యాయి.. అలాగే మృత్యువాత పడినవారి సంఖ్య కూడా అధికంగానే వుంది. అయితే ఏప్రిల్, మే నెలల్లో విజృంభించిన రెండవ దశ.. మరో మూడు మాసాలకు పైగానే విస్తరిస్తోంది. ఇప్పటికీ వ్యాప్తి కొనసాగుతోంది. కాగా, కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు దేశ ప్రజలకు యుద్దప్రాతిపదికన కరోనా వాక్సీన్ వేస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నం అవుతోంది.

కరోనా మహమ్మారికి టీకాకు కూడా లొంగడంలేదు. టీకాలు వేసుకున్న వారి జోలికి ఇది రాదని వైద్యులు చెబుతున్నా.. అది మాత్రం ఎవ్వరినీ వదలడం లేదు. టీకా తీసుకున్న వారిని కూడా పట్టి పీడిస్తోందీ మహమ్మారి. టీకా తీసుకున్న ఒకరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 40 వేల మందికిపైగా వ్యక్తులకు కరోనా సోకడం అధికారులను కలవరపరుస్తోంది. నిజానికి టీకా వేయించుకున్న తర్వాత కొవిడ్ సోకడం చాలా అరుదు. కానీ కేరళలో మాత్రం టీకా తీసుకున్నవారికి కూడా ఇది సోకడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాక్సిన్ ద్వారా అభివృద్ధి చెందే రోగ నిరోధకశక్తిని ఎదుర్కోని మళ్లీ కరోనా సోకడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజా కేసులతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం జన్యు క్రమాన్ని కనుగొనేందుకు నమూనాలు పంపాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని కోరింది.

ఈ కేసులకేమైనా వైరస్ జన్యుమార్పిడి కారణమా? అన్ని విషయాన్ని కనుగొననుంది. కొత్త వేరియంట్లు కొత్త వేవ్‌లకు కారణమవుతుంటాయి. అలా దేశంలో ఇటీవల పెద్ద ఎత్తున విరుచుకుపడిన సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంటే కారణమన్న సంగతి తెలిసిందే. అయితే, సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గినప్పటికీ కొత్త వేరియంట్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇక, వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా బారినపడిన కేసుల్లో అత్యధిక శాతం పతనంథిట్ట జిల్లాలోనే నమోదయ్యాయి. వీరిలో రెండు డోసులు తీసుకున్నవారూ ఉన్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తొలి డోసు తీసుకున్న వారిలో 14,974 మంది వైరస్ బారినపడగా, రెండు డోసులు తీసుకున్న వారు 5,042 మంది ఉన్నారు. కాగా, కేరళలో గత కొన్ని వారాలుగా రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles