People Witness Driverless Bullet in Maharashtra చోదకుడు లేకుండానే.. 300 మీటర్లు నడిచిన బైక్.?

People witness driverless bullet on pune nashik highway one injured

CCTV footage, Aired On Road, bike ride without driver, driverless bike, driving licence, Pune, viral videos, video viral, Maharashtra

People travelling on the Pune-Nashik highway got to witness a Bullet motorcycle on the road speeding without a driver which had created quite a stir.

ITEMVIDEOS: చోదకుడు లేకుండానే.. 300 మీటర్లు నడిచిన బైక్.?

Posted: 08/11/2021 06:54 PM IST
People witness driverless bullet on pune nashik highway one injured

డ్రైవర్ లేకుండా కార్లు నడుస్తున్నాయి. ఈ తరహాలో కొత్త టెక్నాలజీపై పలు సంస్థలు ఇప్పటికే పరిశోధనలు చేస్తున్నాయి. గూగుల్ సహా పలు కంపెనీలు ఇప్పటికే కార్లను రూపోందించి వాటిన ట్రయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తిచేసి.. మరింత మెరుగైన సవారీ కోసం అధ్యయనాలు కూడా చేసేస్తున్నాయి. అయితే నాలుగు చక్రాల కార్లు, జీపులేనా.. ప్రపంచవ్యాప్తంగా మాకే గిరాకీ ఎక్కువ. కానీ మాపై మాత్రం ఎలాంటి పరిశోనలు లేవు.. అధ్యయనాలు అంతకన్నా లేవు. ఏం మేము మాత్రం డ్రైవర్ లేకుండా వెళ్లలేమా..? అని అనుకోందేమో తెలియదు కానీ ఓ ద్విచక్రవాహనం ఎవ్వరూ నడిపించకుండానే ఏకంగా మూడు వందల మీటర్ల దూరం ప్రయాణించింది.

అయితే పార్కింగ్ విషయంలో ఏం చేయాలో తెలియక కిందపడిపోయింది. ఔనా.. ఇది నిజమేనా.? అంటే కాదని చెప్పలేం మరి..! డ్రైవర్ లేకుండానే అప్పుడప్పుడు కార్లు, లారీలతో పాటు పలు వాహనాలు రోడ్డుపై వెళ్లి ప్రమాదాల బారిన పడ్డాయి. ఈ ఘటనలు స్థానికులందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఆ వాహనాలు ఎలా వెళ్లాయి ? అని ఆలోచిస్తుంటారు. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా..మహారాష్ట్ర రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. వ్యక్తి లేకుండానే..బైక్ వెళ్లడం చూసిన స్థానికులు నోరెళ్లబెట్టారు. ఏకంగా 300 మీటర్లు వెళ్లి…కిందపడిపోయింది.

మహారాష్ట్రలోని పూణె జిల్లా నారాయణగావ్. రోడ్డుపై వాహనాలు వెళుతున్నాయి. ఎవరి పని వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అంతలో ఎరుపు రంగులో ఉన్న ఓ బైక్ రయ్యిమంటూ రోడ్డుపై వెళుతోంది. బైక్ పై ఎవరూ లేరు. దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. ఓ వ్యక్తి రోడ్డు మీదకు వచ్చి ఇతరులను అప్రమత్తం చేశాడు. అంతలో ఓ జీపు వేగంగా ముందుకు వచ్చింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి..బ్రేక్ వేశాడు. బైక్ దానికి కొద్దిగా ఢీకొని…ఏకంగా టర్న్ తీసుకుంది..కొద్దిదూరం వెళ్లి కిందపడిపోయింది. రోడ్డుపై సుమారు 300 మీటర్ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే..బైక్ ఎందుకు అలా వెళ్లిందో…కారణాలు వెల్లడిస్తున్నారు. ఈ బైక్ నడుపుతున్న ఓ వ్యక్తి వేగంగా నడిపాడని కొంతమంది వెల్లడిస్తున్నారు. ప్రమాదవశాత్తు రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తిని ఢీకొనడంతో అతను కిందపడిపోయాడని తెలిపారు. అయితే..బైకర్ కిందపడిపోయినా..బైక్ మాత్రం ముందుకు దూసుకెళ్లిందని చెప్పారు. ఈ ఘటనలో బైక్ ఢీకొన్న వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. డ్రైవర్ లేకుండా..వెళ్లిన బైక్ కు సంబంధించిన సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles