J&J seeks approval for single-dose Covid-19 vaccine భారత్ లోకి జాన్సెన్ సింగిల్ డోస్ వాక్సీన్..

Johnson johnson applies for approval of its single dose covid vaccine in india

single dose covid vaccine in india, Johnson and Johnson, when will moderna pfizer j&J arrive in india, covid vaccine, emergency use approval, Central Drug Standard Control Organisation, covid vaccine news, J&J single dose vaccine, Biological E. Ltd, Janssen corona vaccine, America, India, US, covid vaccine latest news

Johnson & Johnson has now applied to the Central Drug Standard Control Organisation of India seeking emergency use approval of its single-shot vaccine. Earlier, the company had applied for a trial but as the Centre has now done away with the provision of trial for reputed and recognised vaccines, the Centre asked the vaccine maker to directly apply for approval.

భారత్ లోకి జాన్సెన్ సింగిల్ డోస్ వాక్సీన్.. అనుమతి కోరుతూ ధరఖాస్తూ..

Posted: 08/06/2021 06:18 PM IST
Johnson johnson applies for approval of its single dose covid vaccine in india

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కు చెందిన సింగిల్ డోస్ వాక్సీన్ త్వరలోనే భారత్ లో అందుబాటులోకి రానుంది. ఇదివరకే రష్యాకు చెందిన స్పుట్నిక్-వి సింగిల్ డోసు కరోనా టీకా కోసం రెడ్డి ల్యాబ్స్ సంస్థ కూడా ధరఖాస్తు చేసుకున్నా దానిని కేంద్ర ఔషధ నియంత్రణ మండలి తిరస్కరించింది. కాగా తాజాగా క‌రోనా వైర‌స్ కోసం సింగిల్ డోసు వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి కోరుతూ జాన్స‌న్ అండ్ జాన్స‌న్ శుక్ర‌వారం ద‌ర‌ఖాస్తు చేసుకుంది.

ఈ సంస్థ జాన్సెన్ పేరుతో సింగిల్ డోసు వ్యాక్సిన్ త‌యారు చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో ఈ సంస్థ ఇండియాలో ప్ర‌యోగాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకొని దానిని ఉప‌సంహ‌రించుకుంది. ఇప్ప‌టికే ప‌లు దేశాలు అనుమ‌తించిన ప్ర‌ముఖ వ్యాక్సిన్ల‌ను ట్ర‌య‌ల్స్ అవ‌స‌రం లేకుండా నేరుగా అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తించాల‌ని భార‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. దీంతో పాత ద‌ర‌ఖాస్తును ఉప‌సంహ‌రించుకున్న జే అండ్ జే సంస్థ‌.. తాజాగా అత్య‌వ‌స‌ర వినియోగం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంది.

అత్యవసర వినియోగం కింద తమ సింగిల్ డోస్ వాక్సీన్ కు అనుమతించాలని కోరుతూ క్రితం రోజునే ధరాఖాస్తు చేసుకున్న‌ట్లు ఆ సంస్థ శుక్ర‌వారం ఈ మేరకు విషయాన్ని వెల్ల‌డించింది. ఇండియా ప్ర‌జ‌ల‌కు త‌మ సింగిల్ డోసు వ్యాక్సిన్ అందించే దిశ‌గా ఇది చాలా ముఖ్య‌మైన అడుగు అని ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. హైద‌రాబాద్‌కు చెందిన బ‌యోలాజిక‌ల్ ఈ. లిమిటెడ్ సంస్థ‌తో జే అండ్ జే చేతులు క‌లిపింది. ఇప్ప‌టికే అమెరికాకు చెందిన మోడెర్నాకు భార‌త్ అనుమ‌తించిన విష‌యం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles