UK govt rejects Nawaz Sharif's visa extension plea పాకిస్తాన్ మాజీ ప్రధానికి షాకిచ్చిన బ్రిటన్ హోంశాఖ..

Former pakistan pm nawaz sharif s application for visa extension in uk rejected reports

Nawaz Sharif, Former Pakistan PM, Corruption Charges, Jail Term, Bail, UK Visa Policy, Pakistan,. Pakistan politics, Imran Khan, PMLN, World News

Former Pakistani prime minister Nawaz Sharif's application for visa extension has been turned down by the UK Home Office with the right to appeal, according to media reports on Friday.

పాకిస్తాన్ మాజీ ప్రధానికి షాకిచ్చిన బ్రిటన్ హోంశాఖ..

Posted: 08/06/2021 07:13 PM IST
Former pakistan pm nawaz sharif s application for visa extension in uk rejected reports

అవినీతి అరోపణలపై జైలు శిక్ష పడిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ కు బ్రిటన్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. డెభై ఒక్క ఏళ్ల షరీప్ ప్రధానిగా కొనసాగుతున్న సమయంలోనే అవినీతికి పాల్పడి పదవికి దూరం అయ్యాడు. అతనిపై మోపబడిని అభియోగాలు కూడా రుజువయ్యాయి, దీంతో పాకిస్థాన్ న్యాయస్థానం అతనికి జైలుశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. కాగా జైలుశిక్ష నుంచి తప్పించుకునేందుకు.. చికిత్స పేరుతో లండన్ లో కాలం వెళ్లదీస్తున్నాడు. కాగా, తన వీసా గడువు పొడిగించాలంటూ నవాజ్ షరీఫ్ ఇటీవల చేసుకున్న దరఖాస్తును యూకే హోంశాఖ తిరస్కరించింది.

అవినీతి కేసుల్లో శిక్ష పడ్డ షరీఫ్.. నిబంధనలకు విరుద్ధంగా తమ దేశంలో ఉంటున్నారని యూకే హోంశాఖ పేర్కొంది. అంతేకాకుండా నవాజ్ షరీఫ్ వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిందే అని యూకే హోంశాఖ స్పష్టం చేసింది. విదేశీయులు బ్రిటన్ లో ఆరు నెలలకు మించి ఉండేందుకు అక్కడి చట్టాలు అనుమతించవు. అయితే ఆరోగ్య కారణాలపై పాక్ ను వీడిన నవాజ్ షరీఫ్… తన వీసాలను అనేక దఫాలుగా పొడిగించుకుంటూ లండన్ లోనే ఉంటున్నారు. అయితే ఈసారి బ్రిటన్ ప్రభుత్వం షరీఫ్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

అయితే యూకే హోంశాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ షరీఫ్ బ్రిటీష్ ఇమ్మిగ్రేషన్ ట్రిబ్యునల్ లో అప్పీల్ చేశారు. తనకు అనారోగ్య కారణాల రీత్యా వీసా గడువు పొడిగించాలని అందులో షరీఫ్ పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో రెండు అవినీతి కేసుల్లో నవాజ్ షరీఫ్ ముద్దాయిగా ఉన్నారు. అల్‌ అజీజియా మిల్స్‌ కేసులో 2018లో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో కొన్నాళ్ల పాటు లాహోర్ జైల్లో కూడా షరీఫ్ ఉన్నారు. అయితే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాననా,వైద్య చికిత్స కోసం బెయిల్ కావాలంటూ.. నవాజ్ షరీఫ్ కోర్టు ఆశ్రయించారు.

దీంతో లాహోర్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో తాను లండన్ వెళ్లేందుకు కూడా అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2019 నుంచి ఆయన లండన్ లోనే చికిత్స పేరుతో కాలం వెళ్లదీస్తున్నారు. అప్పటి నుంచి ఆయన వైద్యం పేరుతో వీసా గడువును పెంచుకుంటూ అక్కడే మకాం వేశారు. అయితే నవాజ్ షరీఫ్ లండన్ వీధుల్లో చలాకీగా తిరుగుతూ, రెస్టారెంట్లలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ఇటీవల బయటికొచ్చిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles