CBI ignore complaints from judges about threats: Supreme Court జార్ఖండ్ న్యాయమూర్తి హత్యపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు.!

Cbi has done nothing we expected some change in its attitude supreme court pulls up cbi

Jharkhand judge killing, Dhanbad judge murder,threats to judges, Supreme Court, politician-criminal nexus, CBI, Central Bureau of Investigation, Chief Justice of India, N.V. Ramana, Supreme Court concerned over threats to judges, judicial independence, threat to judiciary, Railway Police Force, CJI NV Ramana, Justice Surya Kant, Attorney General, KK Venugopal, IB, State police, Uttam Anand, Crime

The Supreme Court said Central agencies such as the Central Bureau of Investigation and the Intelligence Bureau and State police forces chose to ignore complaints from judges about abusive messages and threats even as attacks on the judiciary were on the rise.

దర్యాప్తు సంస్థల పనితీరుపై సీజే ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు.!

Posted: 08/06/2021 05:28 PM IST
Cbi has done nothing we expected some change in its attitude supreme court pulls up cbi

ఝార్ఖండ్ లోని ధనబాద్ జిల్లాకు చెందిన అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసు విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబిఐ, ఐబిల పనితీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థల పనితీరు సంతృప్తికరంగా లేదని వాఖ్యానించారు. తమకు ప్రాణహాని ఉందని, తమ సెల్ ఫోన్లకు అభ్యంతరకరమైన సందేశాలతో పాటు బెదిరింపులు కూడా వస్తున్నాయని అన్నా.. దర్యాప్తు సంస్థలు, పోలీసులు ఏమాత్రం సాయపడటం లేదని సీజేఐ విమర్శించారు.

సీబిఐ తన తీరులో ఏ మాత్రం మార్పును కనబర్చడం లేదని.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశంపై మాట్లాడాల్సిన బాధ్యత తనపై ఉన్నది అని ప్రభాన న్యాయమూరి ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. జడ్జిలకు కనీసం ఫిర్యాదు చేసే స్వేచ్ఛ కూడా లేదా.. అని ప్రశ్నించారు, గతంలో ఎ న్యాయమూర్తికి తాను వెలువరించే న్యాయానికి తన కూతురు ప్రాణానికి బేరి్జు వేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు పూర్తి బాధ్యత తనదేనని సీజేఐ అన్నారు.

ధన్ బాద్ జిల్లాలో యువ జడ్జి ఉత్తమ్ ఆనంద్ ను కోల్పయామని, అక్కడి బొగ్గు మాఫియా రాజ్యమేలి న్యాయాన్ని హతమార్చిందని అన్నారు. హత్య కేసును సుమోటోగా తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. విచారణ సందర్భంగా ఝార్ఖండ్ పోలీసులు సమర్పించిన చార్జీషీటుపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది అత్యున్నత  న్యాయస్థాన ధర్మాసనం. తాను ఇలాంటి చార్జిషీట్‌ను ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌లేద‌ని వ్యాఖ్యానించారు. చార్జిషీటులో బ‌ల‌మైన సాక్ష్యాల‌ను న‌మోదు చేయ‌కపోవడంతో పోలీసులపై అనుమానం క‌లుగుతుంద‌ని పేర్కొన్నారు.

నిందితుల‌కు బెయిల్ ల‌భించేందుకు వీలుప‌డేలా చార్జిషీట్ రూపొందించిన‌ట్లుగా అనిపిస్తుంద‌న్నారు. ఇప్పటిదాకా దాడులకు గురైన న్యాయమూర్తుల జాబితా తన వద్ద ఉందన్నారు. గనుల మాఫియా ఉన్న ప్రాంతాల్లోని జడ్జిలకు, వారి నివాస సముదాయాలకు పూర్తి రక్షణ కల్పించాలని ఆదేశించారు. జడ్జిల రక్షణకు సంబంధించి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కౌంటర్లు దాఖలు చేశాయని, మిగతా రాష్ట్రాలూ త్వరగా సమర్పించాలని ఆయన సూచించారు. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles