Lucknow cab driver threatens suicide if girl not arrested నెట్టింట్లో క్యాబ్ డ్రైవర్ ను కోట్టిన యువతి పాత వీడియో వైరల్

Should a girl not defend herself asks woman who thrashed cab driver in lucknow

priyadarshini, another video, lucknow girl another video goes viral, lucknow girl priyadarshini, lucknow gril black paint, international drones, gril assaults cab driver, girl assaults mediator, girl assaults cab driver on road, uttar pradesh girl assaults cab driver, cab driver assaulted awadh cross road, lucknow, Awadh crossroads, #ArrestLucknowGirl, lucknowgirl, viral, social media, twitter, Uttar Pradesh news, viral video

Lucknow girl, Priyadarshini Narayan Yadav, who made headlines after assaulting a cab driver went viral on social media, now an another video has surfaced on social media. In this two years old video, she can be seen arguing with her neighbours and requesting the police to direct them to paint their walls “anti-black”.

ITEMVIDEOS: నెట్టింట్లో క్యాబ్ డ్రైవర్ ను కోట్టిన యువతి పాత వీడియో వైరల్..

Posted: 08/06/2021 04:35 PM IST
Should a girl not defend herself asks woman who thrashed cab driver in lucknow

ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలోని అవధ్ క్రాస్ రోడ్స్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక యువతి అకారణంగా క్యాబ్ డ్రైవర్ ను కొట్టిన ఘటనతో లక్నోకి చెందిన యువతి వెలుగులోకి వచ్చింది. అమెను ఫేక్ పెమినిస్ట్ అని నెటిజనులు మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా అరెస్ట్ లక్నో గర్ల హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేయడంతో పోలీసులు అమెపై ఎట్టకేలకు లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు. తనను అకారణంగా కోట్టిన యువతిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన క్యాబ్ డ్రైవర్ సాదత్ అలి లేనిపక్షంలో తాను ఆత్మహత్యే శరణ్యమని అంటున్నాడు.

అయితే క్యాబ్ డ్రైవర్ పై దాడితో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన యువతి ప్రియదర్శిని నారయణ్ యాదవ్.. మళ్లీ నెట్టింట్లో సంచలనంగా మారింది. ఆత్మరక్షణ కోసమే తాను క్యాబ్ డ్రైవర్ పై దాడికి పాల్పడ్డానని సమర్థించుకున్న యువతి గత ఏడాది కాలంగా తనకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయని పేర్కోన్న విషక్ష్ం తెలిసిందే. అయితే అమె మాట్లల్లోనూ నిజం లేకపోలేదని తాజాగా నెట్టింట్లో అమెకు చెందిన మరో వీడియో స్పష్టం చేస్తోంది. అమె చేస్తున్న పిర్యాదులను పోలీసులు తేలిగ్గా తీసుకుంటున్నారని.. అందుచేతే తాను తన ఆత్మరక్షణ నేపథ్యంలోనే దాడి చేశానని చెప్పుకోచ్చింది.

సన్ని నెహ్రా అనే వ్యక్తి పోస్టు చేసిన ఈ వీడియో రెండేళ్ల కిత్రందే అయినా.. తాజాగా నెట్టింట్లో మాత్రం ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియోలో తమ కాలనీలోని పోరిగింటివారు తమ ప్రధానగేటుకు నల్లరంగు వేయడంతో ప్రియదర్శని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గేటు నల్లరంగు ఎందుకు వేశారని.? నిలదీసింది. అసలు నల్లరంగు ఎవరైనా వేస్తారా.? అంటూ మండిపడింది. దాని వల్ల కాలనీ మొత్తాన్ని ప్రమాదంలో పడేస్తారని అరిచింది. దీంతో కాలనీవాసుల పిర్యాదుతో అక్కడికి వచ్చిన పోలీసులు అమెకు నచ్చజెప్పి పంపించారు. నల్లరంగు వేయడం వల్ల వారితో పాటు కాలనీవాసులు మొత్తం ప్రమాదంలో పడ్డారని చెప్పింది.

కాలనీవాసులందరికీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టే నల్లరంగు వెనుకనున్న రహస్యమేంటీ.. ఇది కొంచెం అలోచించాల్సిన విషయమే.. ఎంత ఆలోచించినా మనకు బోధపడదు కానీ.. అలాంటి ప్రయత్నాలు చేయాల్సిన పనిలేకుండా ప్రియదర్శిని పోలీసుల ముందే వివరణ ఇచ్చింది. నల్లరంగు డ్రోన్లును అకర్షిస్తాయని, వీరు గేటు వేసిన రంగు వల్ల అంతర్జాతీయ డ్రోన్లు వచ్చి దాడి చేస్తాయని గగ్గోలు పెట్టింది. అర్ధరాత్రి నడివీధిలోకి వచ్చి గొడవకు దిగడంతో కాలనీలో గందరగోళం ఏర్పడింది. పోలీసులొచ్చి నచ్చజెప్పినా ప్రియదర్శిని ఎంతకూ వెనక్కు తగ్గలేదు.

గేటుకున్న నల్ల రంగును తొలగించేలా తక్షణం మౌఖిక అదేశాలు ఇవాల్సిందేనంటూ పట్టుబట్టింది. అంతేకాదు తనను సదరు ఇంటికి చెందిన వ్యక్తులు బరాక్ హుస్సేన్ ఒబామా కూతురంటూ కించపర్చేవిధంగా మాట్లాడారని అమె పోలీసులకు పిర్యాదు చేసింది. ఇలా అనోచ్చా.. వారు అన్నారని ఆ ఇంట్లోని కుర్రాడు తీసిన వీడియోనే అందుకు సాక్ష్యం అని కూడా చెప్పింది. అంతేకాదు ఇంట్లోని వ్యక్తి తాను ప్రధాన మంత్రి కన్నా గోప్పవాడినని అన్నాడని, అలా ప్రధానమంత్రిని అవమానించే పనులు చేయవచ్చా.? అని కూడా నిలదీసింది. ఇలా పోలీసులకు అమె పిర్యాదు చేసినా.. అమెను ఎలాగోలా అక్కడ్నుంచి పంపించేందుకు పోలీసులు చోరవ చూపారు తప్ప అమె పిర్యాదులను పరిగణలోకి తీసుకోలేదన్నది ప్రియదర్శిని వాదన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles