నాది కానిది ఒక్క రూపాయైనా నేను ఆశపడను.. నాదైన ఒక్క రూపాయిని నేను వదులుకోను అన్న డైలాగ్ మాదిరిగానే కాసింత చట్టాలపై అవగాహన వున్న ఏ వ్యక్తులైనా.. ఇలాగే అలోచిస్తారు. అయితే సభ్యసమాజంలో మరీ చిల్లర డబ్బుల కోసం ఎందుకులే అనుకునేవారు మాత్రం చిన్నచితక కేసులంటూ వదిలేస్తుంటారు. కానీ ఇది అన్యాయం అని పోరాడే వారు మాత్రం వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలోనే వుంటారు. అలాంటి వారిలో ఎస్ ఉమేష్ కుమార్ ఒకరనే చెప్పాలి. తనకు జరిగిన అన్యాయంపై ఆయన ఏకంగా కన్యూమర్ కమీషన్ లో కేసు వేసి మరీ పోరాడారు.
మాల్స్‌లో, రీటైల్ స్టోర్స్‌లో క్యారీ బ్యాగ్‌లపై వారి లోగోలను వేసుకున్న కవర్లను అనేక మంది పట్టుకుని తిరుగుతుండటం చూశాం. అయితే.. ఇలానే ఉమేష్ కుమార్ కూడా గత ఏప్రిల్ మాసంలో అన్ లిమిటెడ్ ఫ్యాషన్ అవుట్ లెట్ కు వెళ్లి షాపింగ్ చేశారు. అక్కడ షాపింగ్ అనంతరం కవరుకు కూడా రేటు కట్టి విక్రయించడం గమనించిన ఆయన.. దీనిపై కన్జూమర్ కోర్టులో కేసు వేసి గెలిచారు, వినియోగదారుల ఫోరం క్యారీ బ్యాగ్‌ను అమ్మినందుకు అన్లిమిటెడ్ స్టోర్‌కు కవరు డబ్బులను తిరిగి చెల్లించడంతో పాటు జరిమానా కూడా విధించింది.
ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని జామ్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఎస్ ఉమేష్ కుమార్ అనే వ్యక్తి ఏఎస్ రావు నగర్‌లోని అన్లిమిటెడ్ స్టోర్‌లో 1,198రూపాయలు ఖర్చుపెట్టి రెండు జీన్స్ ప్యాంట్లను 2019 ఏప్రిల్‌లో కొన్నారు. బిల్లు చేతికిచ్చిన తర్వాత క్యారీ బ్యాగ్‌కు కూడా స్టోర్ రూ.6.25 వసూలు చేసింది. అన్లిమిటెడ్ లోగో ఉన్న సంచికి డబ్బులు ఎలా వసూలు చేస్తారంటూ ప్రశ్నించారు.
కాగా ఫ్యాషన్ ఔట్ లెట్ యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాలేదు. లోగో లేని సంచి ఇవ్వాలని కోరగా అటువంటి పని చెయ్యలేదు. దీంతో ఉమేశ్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. అప్పటి నుంచి విచారించిన రంగారెడ్డి జిల్లా కమిషన్ రూ.6.25 తిరిగి చెల్లించడంతో పాటు పరిహారంగా రూ.1,500, కేసు ఖర్చుల నిమిత్తం రూ.1,000, ముప్పై రోజుల్లోగా కస్టమర్‌కు చెల్లించాలని అన్లిమిటెడ్ స్టోర్‌ను ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more
May 19 | వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వారణాసిలోని స్థానిక కోర్టు ఈ కేసును విచారించకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ఈ కేసులో శుక్రవారం మధ్యాహ్నం... Read more
May 19 | నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు ప్రతీరోజు నదుల్లోనే స్నానం చేస్తుంటారు. నదీ సాన్నాలు ఆచరించడం వారి జీవన విధానంలో భాగమైపోతుంది. క్రమంగా అడవులు తగ్గడం, వర్షాలు కురవకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రవహించాల్సిన నదులు కూడా నానిటికీ... Read more