Telakapalli Ravi Too Rejects AP Govt Award సాయినాథ్ బాటలోనే తెలకపల్లి.. వైఎస్సార్ అవార్డు తిరస్కరణ

Telakapalli ravi too rejects ysr life time achievement award of ap govt

Palagummi Sainath, Telakapalli Ravi, YSR Lifetime Achievement Award, biased politicians, media, AP Governent Awards, Andhra Pradesh, Politics

After Palagummi Sainath, Senior Journalist Telakapalli Ravi also rejected the YSR Lifetime Achievement Award, did not cite any reason while rejecting the YSR Life Time Achievement Award. On the eve of the birth anniversary of former Andhra Pradesh Chief Minister late Y.S. Rajasekhara Reddy, the state government announced the YSR Lifetime Achievement Awards and YSR Achievement Awards.

సాయినాథ్ బాటలోనే తెలకపల్లి.. వైఎస్సార్ అవార్డు తిరస్కరణ

Posted: 08/06/2021 02:37 PM IST
Telakapalli ravi too rejects ysr life time achievement award of ap govt

సీనియర్ జ‌ర్న‌లిస్టు తెలకపల్లి రవి కూడా పాలగుమ్మి సాయినాథ్ బాటలోనే పయనించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్ జీవిత సాఫల్య అవార్డును ఆయన తిరస్కరించారు. ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు ఎంపిక చేసిన ప్రముఖులలో తెలకపల్లి రవి పేరు కూడా ఉన్న విష‌యం తెలిసిందే. ఇవాళ తాజాగా ఆయన రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డును తిర‌స్క‌రిస్తున్న‌ట్లు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలోనూ స్ప‌ష్టం చేశారు.

గత నెలలో ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ జీవిత సాఫల్య అవార్డులతో పాటు అచీమ్ మెంట్ అవార్డులను కూడా ప్రకటించింది. కాగా రాష్ట ప్రభుత్వం తరుపున జివిడి కృష్ణ మోహన్ ఈ అవార్డును ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే సీనియర్ జ‌ర్న‌లిస్టు పాలగుమ్మి సాయినాథ్ అవార్డును తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు ఎప్పుడు ప్రభుత్వం ప్రకటించే అవార్డులను తీసుకోరాదని కూడా సాయినాథ్ తెలిపారు. ప్రభుత్వ వార్తలను రాసే.. లేక విధానాలను విమర్శించే జర్నలిస్టులు ప్రభుత్వ అవార్డులను ఎలా స్వీకరిస్తారని ఆయన ప్రశ్నించారు.

తాజాగా సీనియర్ జర్నలిస్టు.. ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్ గా చాలా కాలం వ్యవహరించిన తెలకపల్లి రవి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అవార్డును తిర‌స్క‌రించ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం ఉన్న వివాదాస్పద రాజకీయ మీడియా, సామాజిక మాధ్య‌మాల వాతావరణంలో ఈ అవార్డును స్వీకరిండం లేదని ఆయన  తెలిపారు. అయితే, ఈ పురస్కారం త‌న‌కు ప్రకటించి, త‌న ప‌ట్ల‌ గౌరవాదరణ క‌న‌బ‌ర్చిన ఏపీ ప్రభుత్వం, ఎంపిక కమిటీకి, అభినందనలు తెలిపిన మిత్రులకు ధన్యవాదాలు చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు.

కాగా, ఇటీవల ఏపీ ప్ర‌భుత్వం వివిధ రంగాలకు చెందిన సంస్థలు, ప్రతిభ కనబర్చిన వ్యక్తులు, కళాకారులకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌, అచీవ్‌మెంట్‌ పురస్కారాలను ప్రకటించింది. 31 మంది లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌, 32 మంది అచీవ్‌మెంట్ పుర‌స్కారాల‌కు ఎంపిక‌య్యారు. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్ కింద రూ.10 లక్షలు, అచీవ్‌మెంట్ కింద రూ.5 లక్షలు, జ్ఞాపిక అందజేసి ఆగస్టు 14న లేక‌ 15న‌ సత్కరిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles