Sexual assault between thighs also rape, rules Kerala high court ..ఎక్కడ టచ్ చేసినా అత్యాచారమే: కేరళ హైకోర్టు సంచలన తీర్పు

Penile sexual assault between thighs of victim held together amounts to rape kerala hc

rape, definition, IPC, POCSO, rape kerala high court order, penile sexual asaault between thighs rape, section 375, Indian Penal Cod, rape punishment in India, rape definition in india, Minor child, Sexual assault, penetrative sexual act, Kerala High Court, section 375, Kerala, crime

The Kerala High Court has held that any manipulation of the body of a woman such as penetrative sexual act between the thighs of a victim to simulate a sensation akin to penetration of an orifice is rape.

..ఎక్కడ టచ్ చేసినా అత్యాచారమే: కేరళ హైకోర్టు సంచలన తీర్పు

Posted: 08/06/2021 12:30 PM IST
Penile sexual assault between thighs of victim held together amounts to rape kerala hc

చిన్నారులపై లైంగిక దాడి కేసులో కేర‌ళ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. జీవిత ఖైదు శిక్షను ఎదుర్కోంటున్న ఓ నిందితుడు.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు ఆశ్రయించగా.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. బాధిత మహిళ, చిన్నారుల శరీరాన్ని పురుషాంగంతో ఎక్క‌డ ట‌చ్ చేసినా అది సెక్షన్ 375 కింద అత్యాచారం కింద‌కే వ‌స్తుంద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. అంగప్రవేశం జరక్కపోయినా అత్యాచారంగానే పరిగణించాల్సి ఉంటుందని తీర్పునిచ్చింది.

11 ఏళ్ల మైనర్ బాలికపై ఆరు నెలల క్రితం జరిగిన అత్యాచారం కేసులో కింద కోర్టు నిందితుడ్ని దోషిగా పరిగణించి జీవిత ఖైదు శిక్షను విధించింది. దీనిని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన దోషి.. అంగప్రవేశం జరగనందున దాన్ని అత్యాచారంగా పరిగణించరాదని హైకోర్టును ఆశ్రయించాడు. తన పురుషాంగం బాలిక తొడలకు మాత్రమే తగిలిందని, అది లైంగిక‌దాడి కాదని నిందితుడు పిటిషన్ లో పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు.. ఆడవారి శరీరంలోని ఏ అవయవంలోకైనా పురుషాంగం చొచ్చుకుపోడానికి చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా సెక్షన్ 375 ప్రకారం అత్యాచారంగానే పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.

ఈ మేరకు జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌, జియాద్‌ రహ్మాన్‌లతో కూడి ధర్మాసనం పేర్కొంది. కాగా, సెక్షన్ 375 ప్రకారం కేసులు నమోదు చేశారని, అంగప్రవేశం జరిగితేనే ఇలాంటి కేసులు పెట్టాలని నిందితుడి తరపు న్యాయవాది వాదనలను తోసిపుచ్చింది. జననాంగం, మూత్రనాళం, నోరు వంటి వాటినే కాకుండా ఇతర భాగాలపై కూడా పురుషాంగంతో ఎలాంటి దాడి చేసినా అది లైంగిక దాడిగానే పరిగణించాలని సెక్షన్ 375(C) చదివితే తెలుస్తుందని న్యాయవాదికి చురకలు అంటించింది. ఈ విషయంలో న్యాయస్థానాలకు విచక్షణాధికారాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. నిందితుడికి దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదును యథాతథంగా అమలు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Minor child  Sexual assault  penetrative sexual act  Kerala High Court  section 375  Kerala  crime  

Other Articles