Keralite win Rs 30 crore in Abu Dhabi Big Ticket draw ఖతార్ లోని కేరళ వ్యక్తిని వరించిన అదృష్టం..

Actor harisree ashokan s son in law friends win rs 30 crore abu dhabi lottery

Actor Harisree Ashokan, Actors son in law, Sanoop Sunil, Rs 30 crore lottery, UAE Dirhams, Prize money lottery, Vyttila, Ernakulam, UAE, Abu Dhabi Big Ticket raffle, 19 friends, Lulu management, Lottery

Actor Harisree Ashokan's son-in-law, friends win Rs 30-crore Abu Dhabi lottery. Doha: Sanoop Sunil, a 32-year-old youth belonging to Vyttila in Ernakulam, has won the 15 million UAE Dirhams bumper prize in the Abu Dhabi Big Ticket raffle draw along with 19 friends. The prize money equals around Rs 30 crore

ఖతార్ లోని కేరళ వ్యక్తిని వరించిన అదృష్టం.. లాటరీలో ఫస్ట్ ప్రైజ్

Posted: 08/06/2021 11:26 AM IST
Actor harisree ashokan s son in law friends win rs 30 crore abu dhabi lottery

భారతీయులను అదృష్ణదేవత వరిస్తున్న ఘటనలు ఈ మధ్య పెరుగుతున్నాయి. మొన్నటికి మెన్న ఓ క్యాబ్ డ్రైవర్, ఆ తరువాత ఓ నేవి ఉద్యోగి.. అంతకుముందు అనేక మంది భారతీయులను లాటరీ రూపంలో అదృష్టం వరిస్తోంది. అరబ్ దేశాల్లోని లాటరీ జాకపాట్ లన్నీ మన దేశానికి చెందిన వారే గెలుచుకుంటున్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా కేరళ రాష్ట్రానికి చెందిన వారిన అరబ్ దేశ లాటరీ అదృష్టం వరించడం ముదావహం. తాజాగా అబుదబిలోని ఖతార్ లో ఉండే కేరళకు చెందిన సనూప్ సునీల్ కు అతిపెద్ద జాక్ పాట్ తగిలింది.

అబుధాబి బిగ్ టికెట్ రాఫెల్ లో సునీల్ ఏకంగా 15 మిలియన్ అరబ్ కరెన్సీ దిర్హమ్స్ గెలుచుకున్నాడు.. వాటి విలువ ఏకంగా భారతీయ కరెన్సీలో 30.31కోట్లు. సనూప్ సునీల్ ఖతార్ లోని లూలూ గ్రూపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతని స్నేహితులైన భారతదేశానికే చెందిన 19మంది తో కలసి తలా కొద్ది మొత్తం డబ్బులు వేసుకుని జులై 13వ తేదిన ఓ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశారు. లాటరీకి సంబంధించి విజేతల ఎంపిక కార్యక్రమాన్ని లాటరీ నిర్వహాకులు లైవ్ ద్వారా నిర్వహించారు. కొంత సేవు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన సునూస్ తరువాత ఏదో పనిపై బయటకు వెళ్లాడు.  

కాగా, లాటరీ నిర్వాహకులు టిక్కెట్ పై ఇచ్చిన ఫోన్ నెంబర్ కు కాల్ చేశారు. అయితే సునూప్ కేరళలో ఉన్న తన భార్య ఫోన్ నెంబరును ఇచ్చాడు. దీంతో ఖాతార్ లో వున్న సునీల్ కు విషయం తెలియలేదు. అయితే ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించిన సునూప్ స్నేహితులు అతడికి సమాచారం అందించారు. సునీల్ కు ఫోన్ చేసి లాటరీలో మొదటి బహుమతి కైవసం చెసుకున్నట్లు తెలియజేశారు. అయినా నమ్మలేకపోయిన సునూన్ లాటరీ నిర్వాహకులకు ఫోన్ చేసి నిర్ధారించుకున్నాడు. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

గతంలో అనేక పర్యాయాలు లాటరీ తగులుతుందని ఆశించిన సునూప్ లైవ్ కార్యక్రమాలను అనేకం వీక్షించాడు. అయితే అయనకు తరచూ నిరాశే ఎదురైంది. ఏడేళ్లు నుంచి ఇప్పటి వరకు స్నేహితులతో కలసి లాటరీ టికెట్ ను కొనుగోలు చేసినా.. ఇప్పటి వరకు ఒక్క లాటరీ టికెట్ కూడా గెలవలేకపోయాడు. అయినా సరే.. మళ్లీ తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు తన 19 మంది స్నేహితులతో కలసి సునూప్ లాటరీ టికెట్ ను కోనుగోలు చేశారు. ఈ సారి కూడా తనకు అదృష్టం లేదనుకుని బయటకు వెళ్లిన సునూప్ కు స్నేహితులు తీయని కబరు అందించారు.  

అయితే సునూప్ తాను లాటరీ విజేతగా అవతరించడానికి కారణం ఖతార్ లోని లులూ గ్రూపు యాజమాన్యమని, తన బాస్ సహకారంతోనే తాను గెలుపోందానని తెలిపారు. తన తల్లికి అనారోగ్యం కారణంగా తాను గతేడాది తన ఉద్యోగానికి రాజీనామా చేద్దామని భావించానని, ఈ మేరకు తన విరమణ లెఖను కూడా యాజమాన్యానికి అందించానని, అయితే యాజామన్యం తనను వదులుకోలేక.. సుదీర్ఘ లీవ్ ను మంజూరు చేసిందని, దీంతో తాను తన తల్లి ఆరోగ్యం కుదుటపడిన తరువాత.. ఈ జనవరిలో ఖతార్ చేరకున్నానని.. లేకపోతే తాను ఈ లాటరీని కొనుగోలు కూడా చేసేవాడిని కాదని అన్నాడు. వచ్చిన డబ్బును తన 19స్నేహితులకు సమానంగా పంచి ఇవ్వనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles