ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలోని అవధ్ క్రాస్ రోడ్స్ వద్దనున్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక యువతి అకారణంగా క్యాబ్ డ్రైవర్ ను కొట్టిన ఘటనపై ఎట్టకేలకు లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు. తనను అకారణంగా కోట్టిన యువతిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన క్యాబ్ డ్రైవర్ సాదత్ అలి లేనిపక్షంలో తాను ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు. తాను ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించలేదని, అయినప్పటికీ పోలీసులు తనపై కేసు పెట్టారని సాదత్ అలి వాపోయాడు. పోలీసులు ఒక రోజంతా తనకు ఆహారం కూడా పెట్టలేదని, ఆ యువతి చెప్పిందే విన్నారు తప్పితే పేదవాడినైన తన మాటలు ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రియదర్శిని అనే మహిళను తాను సివిల్ డ్రెస్ లో వున్న పోలీసు అని భావించానని, అందుకనే అమె తనపై దాడి చేస్తున్నా.. మిన్నకుండిపోయానని చెప్పారు. ఆమె తన ఫోన్ ను పగలగొట్టిందని, కారు సైడ్ అద్దాలను బద్దలగొట్టడమే కాకుండా, తన జేబులో ఉన్న రూ. 600 కూడా లాక్కుందని ఆరోపించాడు. కాగా యువతి వాదన మరోలా వుంది. తాను రోడ్డు దాటుతున్న సమయంలో కారుతో అతడు అతిసమీపంగా వచ్చాడని, దాదాపు ఢీకొట్టేంత పని చేశాడని ఆరోపిస్తూ అతడిని క్యాబ్ నుంచి కిందికి లాగి ఎడాపెడా చెంపలు వాయించింది. అయితే సీసీటీవీ ఫూటేజీని పరిశీలించిన పోలీసులకు యువతి ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నట్లు కనిపించడంతో అమెదే తప్పని నిర్థారణకు వచ్చారు.
దీంతో యువతి అందరికీ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. పోలీసులు తన కుటుంబ సభ్యులను వేధించారని ఆరోపించింది. పోలీసుల దగ్గర తన కుటుంబసభ్యుల ఫోన్ నంబర్లు, వివరాలు ఉన్నాయంది. తనపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవి అడ్డంగా వాదించింది. క్యాబ్ డ్రైవర్ ని ఊరికే కొట్టలేదని, ఆత్మరక్షణ కోసం మాత్రమే చేయి చేసుకున్నా అని తప్పును సమర్థించుకుంది. అంతేకాదు ఏడాది కాలంగా తను వేధింపులకు గురవుతున్నానని, ఈ క్రమంలో తాను పోలీసులను కూడా ఆశ్రయించానని చెప్పింది. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అరోపించింది. మరి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
అసలేం జరిగిందంటే..
జులై 30వ తేదీ రాత్రి 9 గంటల 41 నిమిషాల సమయంలో లక్నోలోని కేసరి ఖేడా ట్రాఫిక్ క్రాసింగ్ వద్ద జరిగినట్లు సీసీటీవీ ఫుటేజి ద్వారా తెలుస్తోంది. ఈ సంఘటనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మహిళ రోడ్డు దాటుతుండగా క్యాబ్ డ్రైవర్ ఆమె ముందు ఆపాడు. దీంతో మహిళ డ్రైవర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ డ్రైవర్ ను కొట్టింది. గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు ఆ మహిళ రోడ్డు దాటిందని సిసిటీవీ ఫూటేజీలో స్పష్టంగా నిక్షిప్తమై వుంది. వాస్తవానికి అక్కడ ఉన్న సిగ్నల్ ఫ్రీ లెఫ్ట్ చూపిస్తున్నా.. వాహనాలు వేగంగా వెళ్తుండగా మహిళ రోడ్డు దాటటానికి ప్రయత్నించినట్లు వీడియోలో ఉంది.
Ye lo pura video isme ladke ki galti hogi to batana pic.twitter.com/gumOCP6LAz
— Neeraj Yadav (@thekingneeraj1) August 2, 2021
(And get your daily news straight to your inbox)
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more
May 19 | వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వారణాసిలోని స్థానిక కోర్టు ఈ కేసును విచారించకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ఈ కేసులో శుక్రవారం మధ్యాహ్నం... Read more
May 19 | నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు ప్రతీరోజు నదుల్లోనే స్నానం చేస్తుంటారు. నదీ సాన్నాలు ఆచరించడం వారి జీవన విధానంలో భాగమైపోతుంది. క్రమంగా అడవులు తగ్గడం, వర్షాలు కురవకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రవహించాల్సిన నదులు కూడా నానిటికీ... Read more