TRS’ new entrant Kaushik Reddy nominated as MLC పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన క్యాబినెట్

Padi kaushik reddy nominated as mlc under governor s quota

Padi Kaushik Reddy, CM KCR, Padi Kaushik reddy nominated MLC, Governor quota, By-Elections, Huzurabad, Padi Kaushik Reddy Madannapet Vijender, Padi Kaushik Reddy Audio call viral, Huzurabad By-elections, Etela Rajender By-Elections, Huzurabad, TPCC secretary, KoushikReddy, Phone Call viral, Congress, Audio viral, Etela Rajender, CM KCR, TRS, KTR, Gangula Kamalakar, Harish Rao, Telangana, Politics

Padi Kaushik Reddy from Huzurabad Assembly constituency, who recently joined the Telangana Rashtra Samiti (TRS) from the Congress, has been nominated as MLC under Governor's quota. The state Cabinet meeting chaired by Chief Minister K Chandrashekar Rao approved the nomination of Kaushik Reddy as MLC and referred to Governor Tamilisai Soundararajan for formal approval.

పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన క్యాబినెట్

Posted: 08/02/2021 11:21 AM IST
Padi kaushik reddy nominated as mlc under governor s quota

కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే ఈ సారి హుజురాబాద్ లో జరుగనున్న ఉపఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ తనకేనంటూ ప్రచారం చేసుకుని.. పార్టీ క్రమశిక్షణా చర్యల నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడి.. గత నెల 21న టీఆర్ఎస్ పార్టీలో చేరిన నేత పాడి కౌశిక్ రెడ్డికి పార్టీ అధిష్టానం అందలాన్ని ఎక్కించింది. హుజూరాబాద్ నుంచి ఎన్నికలలో పోటీకి సై అన్న కౌశిక్ రెడ్డిని పోరాటం నుంచి తప్పించిన టీఆర్ఎస్ అధిష్టానం.. ఆయనను గవర్నర్ కోటాలో శాసనమండలికి పంపుతూ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక రాష్ట్రప్రభుత్వం నిర్ణయంపై గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ లాంచనప్రాయంగా అమోదముద్రం వేయడమే ఆలస్యం.

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన తెలంగాణ మంత్రిమండలి పాడి కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఆమోదం కోసం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు సిఫారసు చేసింది. అయితే మాదన్నపేటకు చెందిన విజేందర్ అనే కార్యకర్తతో తాను మాట్లాడిన ఆడియో ఫోన్ కాల్ లీక్ కావడంతో.. ఆయనపై కాంగ్రెస్ పార్టీ చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కౌశిక్ రెడ్డి.. ఈ నెల 21న టీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన పది రోజుల వ్యవదిలో ఎమ్మెల్సీ పదవిని అందిపుచ్చుకున్నారు యువనేత.

టీఆర్ఎస్ నుంచి హుజూరాబాద్ అభ్యర్థిలో బరిలో ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావించినా.. అనూహ్యంగా ఆయనను ఎమ్మెల్సీగా మండలికి పంపాలని నిర్ణయం తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో హుజూరాబాద్ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠ మొదలైంది. టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి ఎల్.రమణ, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస యాదవ్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపి నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఇ పెద్దిరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చినా.. ఈటెలకు చెక్ పెట్టేందుకు బీసీ వర్గానికి చెందిన వారికే టికెట్ కేటాయిస్తారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  Padi Kaushik reddy  MLC  Governor quota  By-Elections  Huzurabad  Etela Rajender  Telangana  Politics  

Other Articles