Nalgonda Police Raid Vishwa Chaitanya Ashram నకిలీ బాబా విశ్వచైతన్య ఆశ్రమంపై పోలీసు దాడులు..

Btech baba fraud nalgonda police raid ashram seize gold property docs

Fake baba, B Tech baba, fake baba, duping people, Gold, cash, Rs 14 Crore Propetirs, documents, Shirdi Sai Baba, Telugu people, You tube channel, Youtube Channel Viswa chaitanya, Ajmapuram village Pedda Adiserla Pally mandal, sp ranganath, crime news , nalgonda crime news,Nalgonda, fake baba, Crime news, Latest Crime News, Nalgonda District, telangana, Crime

Special Task Force police have arrested a fake baba who was cheating people in the name of conducting poojas and rituals to solve their problems on Sunday, after a raid was conducted at his ashram in the district. The accused named Sai Vishwa Chaitanya was arrested by the Nalgonda police after they received a complaint from a woman who stated that the baba had duped her of money while promising to heal her of some issues

నకిలీ బాబా విశ్వచైతన్య ఆశ్రమంపై పోలీసు దాడులు..

Posted: 08/02/2021 12:18 PM IST
Btech baba fraud nalgonda police raid ashram seize gold property docs

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ గా రాణించలేక.. ఐటీ సంస్థలు పెట్టి నష్టపోయి‌.. భగవత్ ధాన్యం చేసుకుంటూ జీవితాన్ని గడపాలని ఆశించిన ఓ వ్యక్తి.. తాను బాబాగా అవతారమెత్తి.. సులభంగా వస్తున్న డబ్బుతో ఆశ పెరిగి.. పూజలు.. యంత్రాలు, మంత్రాలు, సమస్యలు, పరిష్కారాలు అంటూ కొత్త పంథాను ఎంచుకుని.. అపర కుబేరుడిగా అవతారమెత్తాడు. భక్తులను ఆకర్షించేందుకు ఓ యూట్యూబ్‌ చానెల్‌ ఏర్పాటు చేసుకున్నాడు. పలు రోగాలు, మానసిక సమస్యలకు హోమాలు, యజ్ఞాలు చేస్తూ తాయత్తు ఇస్తూ ప్రచారంలోకి వచ్చాడు. ఏడాది కాలంలోనే బాబా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుండగా ఓ మహిళ ఫిర్యాదుతో వ్యవహరం పూర్తిగా బెడిసి కొట్టింది.

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాకు చెందిన విశ్వచైతన్య హైదరాబాదులో సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్ గా పనిచేసేవాడు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ, వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల బారిన పడ్డాడు. దీంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏడాది క్రితం తన మకాం హైదరాబాద్‌ నుంచి నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం మార్చాడు. అక్కడ 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి హైటెక్‌ హంగులతో సాయిబాబా పేరిట ఆశ్రమం ఏర్పాటు చేశాడు. సాయిబాబా ప్రవచనాలు, హోమాలు చేస్తూ..దీర్ఘకాలిక రోగాలు, సంతానం లేని వారి తోపాటు వివిధ రకాల సమస్యలతో బాధపడేవారిని ఆకర్షించసాగాడు.

ప్రజలను సులభంగా మోసం చేసేందుకు నకిలీ బాబా సాయి విశ్వచైతన్య యూట్యూబ్‌ చానెల్ ను ఏర్పాటు చేశాడు. ఈ చానెల్ లో ప్రవచనాలు నిర్వహిస్తూ 7 లక్షల మంది భక్తులను సంపాదించాడు. వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తానని హోమం చేస్తానని లక్షల రూపాయలు వసూలు చేయసాగాడు. మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విజయవాడకు చెందిన ఓ మహిళ అజ్మాపురంలోని ఆశ్రమంలో బాబాను కలిసింది. తన బాధను చెప్పుకోగా అమె సమస్యలన్నింటినీ పరిష్కారిస్తానని అందుకు హోమం చేయాలని ఆమె వద్ద నుంచి లక్షల రూపాయలను దండుకున్నాడు.

భారీగా డబ్బు సమర్పించినా సమస్య అపరిష్కృతంగానే వుండటంతో బాధితురాలు వారం రోజుల క్రితం ఎస్పీ రంగనాథ్ కు ఫిర్యాదు చేసింది. దీంతో నకిలీ బాబాపై విచారణ చేయాలని ఎస్పీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను ఆదేశించారు. రంగంలోకి దిగిన టాస్క్ పోర్స్ నకిలీ బాబా గుట్టును రట్టుచేసింది. సంవత్సరం కాలంగా ఆశ్రమం నిర్వహిస్తూ.. భక్తుల నుంచి వచ్చిన నగదుతో ఏకంగా రూ.14 కోట్ల రూపాయల స్థ్దిరాస్తులను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆశ్రమంలో పోలీసులు సోదాలు నిర్వహించి సుమారు 30 లక్షల నగదు, బంగారం, స్థిరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fake baba  B Tech baba  duping people  Gold  cash  Rs 14 Crore Propetirs  documents  Latest News  Politics  

Other Articles

Today on Telugu Wishesh