Webnar by TTD concludes over birthplace of Hanuman హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రేనని టీటీడీ పునరుద్ఘాటన

Webnar concludes stating anjanadri as hanumans birth place

War of words TTD kishkinda Trust, Tirumala Tirupati Devastanam Board Anjanadri, TTD on Hamuman Birth place, Kishkinda Hanumad Janma Bhoomi Tridha Trust, kishkinda trust on Hanuman Birth Place, Govindananda saraswathi Swamy on Hanuman Birth Place,

The Tirumala Tirupati Devasthanams (TTD) which conducted Webnar over the birth place of Sri Hanuman concludes stating that Anjandri a hill which is named on Hanuman in Tirumala seven Hills is the birth place of Lord Hanuman.

హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రేనని టీటీడీ పునరుద్ఘాటన

Posted: 07/31/2021 08:07 PM IST
Webnar concludes stating anjanadri as hanumans birth place

రామభక్తుడు, స్వామిభక్తి పరాయణుడు హనుమంతుడి జన్మస్థలం విషయమై గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదానికి ఇవాళ జరిగిన వెబ్ నార్ తో ముగింపు పడింది. ఆంజనా దేవి తనయుడు ఆంజనేయ స్వామి జన్మస్థలం తిరుమల కొండలలో కొలువైన అంజనాద్రేనని మరోసారి టీటీడీ పునరుద్ఘాంటించింది. ఆంజనేయ జన్మస్థలంపై టీటీడీ రెండు రోజులపాటు నిర్వహించిన వెబినార్ ముగిసింది. ఈ వెబినార్ లో పాల్గొన్న ప్రముఖులు పండితులంతా అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని అభిప్రాయపడ్డారు. దీనిపై విమర్శలు చేసిన వారిపై పండితులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంస్కృతం, పురాణం, శాస్త్రాల గురించి తెలియని వారికి ఈ అంశంపై మాట్లాడే అర్హత లేదన్నారు.

పండిత పరిషత్ చైర్మన్ ఆచార్య మురళీధర్ శర్మ మాట్లాడుతూ అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం అని చేసిన తమ ప్రకటనను ఒకరిద్దరే వ్యతిరేకించారని తెలిపారు. మరింత మంది ప్రముఖుల అభిప్రాయం కోసం ఈ రంగంలో ప్రముఖులతో వెబినార్ నిర్వహించామని పేర్కొన్నారు. వెబినార్ లో పాల్గొన్న వారందరూ ముక్తకంఠంతో తిరుమలే హనుమంతుని జన్మస్థలంగా తేల్చారని వెల్లడించారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీరామనవమి నాడు ఆంజనేయ జన్మస్థలంపై ప్రకటన చేసి, అభిప్రాయాలను ఆహ్వానించామని తెలిపారు.

తిరుమలలోనే హనుమంతుడు పుట్టాడని తాము మూర్ఖంగా వాదించడం లేదన్నారు. ఇప్పుడు కూడా భిన్న ఆధారాలు ఉంటే తమకు చూపించ వచ్చని తెలిపారు. వెంకటాచలం మహత్యం గురించి అనవసర వివాదాలు లేవనెత్త వద్దన్నారు. త్వరలో ఓ గ్రంధం విడుదల చేయబోతున్నామని పేర్కొన్నారు. ఎవరైనా దీనిపై వాదనకు రావచ్చు.. కానీ దూషించే ప్రయత్నం చేయవద్దన్నారు. సత్యాన్ని అసత్యం చేసే ప్రయత్నం చేయబోము… వితండవాదం చేయబోమని తెలిపారు. ఓ స్వామీజీ తమను దూషించడం తప్ప, ఆధారాలు చూపలేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles