COVID-19 Survivors Are Losing Their Hair కరోనా బాధితుల్లో జుట్టు రాలే సమస్య తాత్కాలికమే

Post covid hair loss is temporary doctors say as complaints pour in

sharp rise, reporting, hairfall, Covid-recovered patients, complaints, City hospitals, Covid-19, post-Covid complication, Covid-19, Hair fall, hairloss, Stress, Nutritional deciciency, Coronavirus

There has been sharp rise in the number of patients complaining about hair loss post Covid-19, said doctors at Apollo Hospital, Indraprastha. According to them, reaction to stressors, nutritional deficiency and inflammation due to Covid-19 are some of the reasons behind the ailment.

కరోనా బాధితుల్లో అధికంగా జుట్టు రాలే సమస్య.. తాత్కాలికమే.!

Posted: 07/30/2021 04:42 PM IST
Post covid hair loss is temporary doctors say as complaints pour in

కరోనా మహమ్మారి బారిన పడిన బాధితులు దాని నుంచి కోలుకున్నా తరువాత కూడా వారిని అనేక అరోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. అయితే మరిముఖ్యంగా మహిళా బాధితుల్లో జుట్టు రాలే సమస్య తీవ్రస్థాయిలో పెరిగిపోతుంది. ఈ మేరకు తమ జట్టు రాలుతుందని బాధితులు అనేక మంది అసుపత్రులను సంప్రదించారని సమాచారం. సాధారణంగా జట్టు రాలే సమస్య ఉన్నవారితో పోల్చితే.. ఏకంగా 100 శాతం వరకు ఈ తరహా కేసులు పెరిగాయని ఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

సాధారణంగా దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వారానికి నాలుగు నుంచి ఐదు వరకు జుట్టు రాలిపోతుందంటూ వస్తున్నారట.. జుట్టు రాలిపోయే సమస్య ఎదుర్కోనే వారి సంఖ్య మే మధ్య నెల నుంచి మొదలయ్యాయని, రిపోర్టులు చెబుతున్నాయి. అప్పటినుంచి క్రమంగా రెట్టింపు సంఖ్యలో ఈ హెయిర్ లాస్ కేసులు పెరిగిపోయాయని ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సాధారణంగా కరోనా నుంచి కోలుకున్న బాధితుల్లో నెల తర్వాత నుంచి వారిలో జుట్టు రాలడం సమస్య మొదలవుతోంది. కొన్ని సందర్భాల్లో కరోనా ఇన్ఫెక్షన్ కొనసాగుతున్నవారిలోనూ జుట్టు రాలే సమస్యను గమనించినట్టు వైద్యులు చెబుతున్నారు.

ఈ సమస్య తాత్కాలికమే: వైద్యులు..!

ఆహారపు అలవాట్లలో తేడా ఉన్నా కూడా జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. వైరస్ సోకి జ్వరంగా ఉన్నప్పుడు, ఒత్తిడి, ఆందోళన, అకస్మాత్తుగా హార్మోన్లు మారిపోయినా కూడా ఇదే సమస్య కనిపిస్తుంటుంది. కరోనా నుంచి కోలుకున్నవారిలోనూ అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో తాత్కాలికంగా జుట్టు కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నారు. రెండింతల స్థాయిలో ఈ తరహా కేసులు పెరిగాయని కాస్మిటిక్, ప్లాస్టిక్ సర్జరీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ షాహీన్ నూర్నియజ్దాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

పోషకాహార లోపం, బరువు తగ్గిపోవడం, హార్మోన్లలో వ్యత్యాసం, విటమిన్ డి తగ్గిపోవడం, బి12 స్థాయిలు కూడా పడిపోవడం వంటి ప్రధాన కారణాలు. దీని కారణంగానే జుట్టు రాలడం సమస్యలు అధికంగా పెరుగుతున్నాయని డాక్టర్ షాహిన్ తెలిపారు. కరోనా సోకి తగ్గిన తర్వాత చాలామందిలో జుట్టు ఊడిపోతుండని అయితే టెలోజన్ ఎఫ్లూవియమ్ సమస్య ఉన్నవారిలో ఈ సమస్య మరింత అధికంగా ఉంటుందని అన్నారు. సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు 100 వెంట్రుకలను కోల్పోవచ్చు. కానీ, టెలోజన్ ఎఫ్లూవియమ్ సమస్య ఉంటే మాత్రం రోజుకు 300 నుంచి 400 వరకు జుట్టును కోల్పోయే అవకాశం ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles