Fireball burns up over North Texas! అకాశం నుంచి అగ్గిగోళాలు.. అందోళనలో అమెరికావాసులు

Fireball streaks across north texas creating light show and sonic boom

fireballs, meteors, Space, fireball, meteors, north texas fireball, sonic boom, bright flash, American Meteor Society (AMS), northeastern Texas, Oklahoma, Missouri, Arkansas, Louisiana, US, America

A fireball streaked across North Texas last night, leading to several hundred witness reports of a bright flash and sonic boom. The celestial drama occurred around 9 p.m. local time on July 25, according to CBS Dallas-Fort Worth. The nonprofit American Meteor Society (AMS) has since recorded 213 reports of the fireball, including three videos. The witnesses were mostly in northeastern Texas, but some reported seeing the fireball above Oklahoma, Missouri, Arkansas and Louisiana.

ITEMVIDEOS: అకాశం నుంచి అగ్గిగోళాలు.. అందోళనలో అమెరికావాసులు

Posted: 07/30/2021 05:45 PM IST
Fireball streaks across north texas creating light show and sonic boom

ఆకాశం నుంచి వర్షపు చినుకులు పడుతున్న క్రమంలో అప్పడటప్పుడు పిడుగులు కూడా పడుతుండటం పరిపాటి. కానీ వర్షపు చినుకులకు బదులు అగ్గిచినుకులు పడితే.. ఆ ఆలోచనే ప్రపంచాన్ని దగ్గం చేసేస్తోంది. కానీ అగ్రరాజ్యం అమెరికాలో అదే నిజమైంది. అకాశం నుండి పెద్ద సైజులో ఉన్న అగ్నిగోళాలు క్రిందికి జారి పడటం అందోళనలకు కారణం అవుతున్నాయి. భూమి గురుత్వాకర్షణ శక్తితో అత్యంత వేగంగా ఇవి అకాశం నుండి భూమి మీదకు చేరుకుంటున్నాయి. వీటిని గుర్తించిన స్థానికులు విస్మయానికి గురయ్యారు.

నిప్పులు చిమ్ముతూ మేఘాల మధ్యలోంచి కిందకు దూసుకువస్తున్న సమయంలో వాటి వేగానికి గాలి చేస్తున్న శబ్దాలు కూడా భయానకంగా వున్నాయి. ఈ అగ్నిగోళాలు ప్రయాణాన్ని టెక్సాస్ వాసులు తమ కెమెరాలలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ఈ తరహా అగ్నిగోళాలు పడటాన్ని ఉల్కాపాతం అంటారు. కొన్ని సందర్భాల్లో ఉల్కలు నక్షత్రాల్లో చిన్నసైజులో ఉండి అకాశం నుండి జారి పడిపోతుంటాయి. అవి పడిపోయే సందర్భంలో బాగా కాంతి వెదజల్లుతాయి.

అమెరికాలో ఆదివారం రాత్రి 9గంటల ప్రాంతంలో అకాశం నుంచి జారిపడుతున్న ఫైర్ బాల్స్ కనిపించాయని అమెరికన్ ఉల్కాపాతం సొసైటీ ఏఎమ్ఎస్ తెలిపింది. టెక్సాస్ తోపాటు, మిస్పౌరీ, అర్కాన్సాస్ తో పాటు మరికొన్ని ప్రాంతాల వాసులు ఈ దృశ్యాలను చూశారు. మొత్తం 213 ఫైర్ బాల్స్ అకాశం నుండి నేలపైకి దూసుకువచ్చినట్లు ఏఎంఎస్ అంచనావేసింది. అకాశంలో ఈ తరహా ఉల్కాపాతం నిత్యం ఏదో ఒకప్రాంతంలో చోటు చేసుకుంటుందని, ఉల్కలు అకాశం నుండి అగ్నిగోళాలుగా క్రిందికి పడిపోతాయని , వీటి వల్ల పెద్దగా నష్టం జరిగిన ఘటనలు ప్రపంచంలో పెద్దగా నమోదు కాలేదని నిపుణులు చెబుతున్నారు. వారంరోజుల క్రితం నార్వేలో సైతం ఇదే తరహా ఉల్కాపాతాన్ని స్ధానికులు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Space  fireball  meteors  north texas fireball  sonic boom  bright flash  US  America  

Other Articles