Sydney police call for military to enforce lockdown సిడ్నీలో డెల్టా విజృంభన.. ఆగస్టు 28 వరకు లాక్ డౌన్..

Sydney readies for the army as lockdown fails to squash australia delta outbreak

Sydney, Australia, Army forces, Police, COVID-19, Sydney Lockdown, Sydney Delta variant, covid-19, covid, Antibodies, COVID-19 Vaccines, Coronavirus, Sydney covid19, sydney delta, Australia delta cases, Australia covid19, Corona Vaccine

Police in Australia's largest city have requested military help to enforce a coronavirus lockdown as infections in Sydney reached a new record. Commissioner Mick Fuller said New South Wales police had asked for 300 Australian Defence Force personnel to be deployed "to boost its operational footprint".

సిడ్నీలో డెల్టా విజృంభన.. ఆగస్టు 28 వరకు లాక్ డౌన్.. రంగంలోకి ఆర్మీ

Posted: 07/30/2021 03:14 PM IST
Sydney readies for the army as lockdown fails to squash australia delta outbreak

కరోనా మహమ్మారి రోమారు యావత్ ప్రపంచాన్ని వణించనుంది. ఈ సారి రూపాన్ని మార్చుకున్న కరోనా డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోందా.? అంటే ఔనని చెప్పక తప్పదు. ఇప్పటికే కరోనాకు పుట్టినిల్లైన చైనాలో మరోసారి కరోనా కలకలం రేగింది, ప్రస్తుతం చైనాలో డెల్టా వేరియంట్‌ కలకలం రేపుతున్నది. ప్రస్తుతం తూర్పు చైనా నగరమైన నాన్జింగ్‌ నగరంలో డెల్టా వేరియంట్ తీవ్ర రూపం దాల్చుతుంది. ఇదే సమయంలో అటు అమెరికాలోనూ డెల్టా వేరియంట్ విజృంభన కొనసాగుతోంది. అదే సమయంలో అస్ట్రేలియాలోని సిడ్ని నగరంలో డెల్టా వేరియంట్ అక్కడి పౌరులను తీవ్ర అలజడికి గురిచేస్తోంది.

ఇప్పటికే అస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో గత నాలుగు వారాలుగా లాక్ డౌన్ అమల్లో ఉంది. అయినా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప.. ఎన్ని చర్చలు తీసుకుంటున్నా వ్యాప్తి ఆగడం లేదు. దీంతో వైద్యఆరోగ్య అధికారులు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో యాభై లక్షల మంది జనాబా కలిగిన సిడ్నీలో లాక్ డౌన్ ను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలకు దిగిన ప్రజలకు అపరాద రుసం వసైళ్లకు కూడా పోలీసులు సిద్దపడ్డారు. అయినా కరోనా కేసుల్లో వేగానికి మాత్రం కళ్లేం పడటం లేదు. దీంతో ఇవాళ సిడ్నీ పోలీసుల వినతి మేరకు 300 మంది ఆర్మీ జవాన్లు కూడా లాక్ డౌన్ విధుల్లో పాలుపంచుకోనున్నారు.

సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ పోలీసు కమీషనర్ మిక్ ఫుల్లర్ వినతి మేరకు 300 మంది అస్ట్రేలియా డిఫెన్స్ ఫోర్స్ పర్సెనల్ ను రంగంలోకి దింపామని.. వీరంతా కరోనా నియంత్రణ విధుల్లో పాల్గోననున్నారని ఆయన తెలిపారు. కరోనా కట్టడికి తాము తీసుకుంటున్న చర్యలకు పలువురు వ్యాపార్థులు కూడా విఘాతం కలిగిస్తున్నారని, వారిపై కూడా చర్యలకు పూనుకునేలా చర్యలుంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక పార్కులు, బీచ్ లు, కాఫీ కేంద్రాలు, స్నేహితులతో ముచ్చట్లకు ఇది అనువైన సమయం కాదని అందరూ ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక లాక్ డౌన్ ను కూడా ఆగస్టు 28 వరకు పోడగించినట్లు తెలిపారు.

జూన్‌లో అక్క‌డ మూడువేల మందికి ఇన్‌ఫెక్ష‌న్ సోకింది. 9 మంది మ‌ర‌ణించారు. లాక్‌డౌన్ అమ‌లులోకి వ‌చ్చి అయిదు వారాల గుడుస్తున్నా.. సిడ్నీలో వైర‌స్ అదుపులోకి రాక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. తాజాగా శుక్ర‌వారం మ‌రో 170 కేసులు న‌మోదు అయ్యాయి. లాక్ డౌన్ ను క‌ఠినంగా అమ‌లు చేసేందుకు ఆర్మీని రంగంలోకి దింప‌డం ప‌ట్ల అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆస్ట్రేలియా ర‌క్ష‌ణ ద‌ళాలు ఇక నుంచి సిడ్నీలో పెట్రోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. హాట్‌స్పాట్‌ల‌ను ఎంపిక చేసి అక్క‌డ వైర‌స్ నియంత్ర‌ణ కోసం కావాల్సిన చ‌ర్య‌ల‌ను తీసుకుంటారు. చాలా క‌ట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని ఆస్ట్రేలియా మెడిక‌ల్ అసోసియేష‌న్ ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles