Faster third wave warned as mask compliance drops డెల్టా వేరియంట్: అత్యంత అప్రమత్తత అవసరమన్న ఆరోగ్యశాఖ

Faster third wave warned by telangana health dept as mask compliance drops

Coivd-19, Coronavirus, corona Third wave, covid third wave, Delta variant, Delta Plus variant, third wave delta variant, Mask, social distance, Health dept, Telangana

Health authorities issued a caveat saying that a third wave could hit Telangana sooner than expected as people have stopped wearing masks and seem to have forgotten Covid-appropriate behaviour. “People are behaving as if they are free from Covid and the mask compliance has dropped by 40 percent,” said director of public health Dr G Srinivasa Rao.

డెల్టా పడగ నీడలో రాష్ట్రం.. అత్యంత అప్రమత్తత అవసరం: ఆరోగ్యశాఖ

Posted: 07/21/2021 05:22 PM IST
Faster third wave warned by telangana health dept as mask compliance drops

కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం తర్వాత ఎట్టకేలకు లాక్‌డౌన్ ఎత్తేసి ప్రజలు సాధారణ పరిస్థితికి వచ్చేశారు. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు మళ్ళీ మాస్క్‌లు లేకుండా ఉండడం.. గుంపులుగా తిరగడం.. షాపింగ్‌లకు తిరగడం వంటివి చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. తెలంగాణకు డెల్టా టెన్షన్ ఇంకా ఉందని.. జనం నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది తెలంగాణ డైరక్టర్‌ ఆఫ్ హెల్త్‌. తెలంగాణలో డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోందని, వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతూనే.. డెల్టా వేరియంట్‌ ప్రభావం మరో రెండు నెలల వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఏడు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బంది పర్యటించారని ఆయా ప్రాంతాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించినట్లు వెల్లడించారు. తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నా.. వరుస పండుగల దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే.. తీవ్రతను పట్టించుకోకుండా కొంత మంది ప్రజలు సామాజిక బాధ్యతను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు డీహెచ్‌. కొవిడ్ జాగ్రత్తలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, డెల్టా వేరియంట్‌ గాలి ద్వారా వ్యాపిస్తోందని సంచలన ప్రకటన చేశారు.

ప్రజలు ఇంట్లో కూడా మాస్క్ ధరించాలని, మాస్క్ లేకుండా ఉత్సవాల్లో పాల్గొనరాదని.. మాల్స్‌కి గుంపులు గుంపులుగా వెళ్లడం సరికాదని తెలిపారు తెలంగాణ డైరక్టర్‌ ఆఫ్ హెల్త్‌. రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు పెరిగాయి. రాజకీయ నాయకులు కనీసం మాస్క్‌లు కూడా పెట్టుకోకుండా మాట్లాడుతున్నారు. లక్ష మంది వైద్య సిబ్బంది కరోనా కట్టడి కోసం నిరంతరం పనిచేస్తున్నారు. ఇప్పటికే వైద్య, పోలీసు, మున్సిపల్ సిబ్బంది అలిసిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు డీహెచ్ శ్రీనివాసరావు‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coivd-19  Coronavirus  corona Third wave delta variant  Mask  social distance  Health dept  Telangana  

Other Articles