Koushik reddy joins TRS in KCR’s presence సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి

Former huzurabad cong chief kaushik reddy joins trs in kcr s presence

TPCC former secretary Padi Kaushik Reddy, Padi Kaushik Reddy, Huzurabad TRS leader, Padi Kaushik Reddy Audio call viral, Huzurabad By-elections, Etela Rajender By-Elections, Huzurabad, TRS KoushikReddy, Congress, TRS, Etela Rajender, Telangana, Politics

Days after he resigned from the Congress party following an audio clip row, Huzurabad leader Kaushik Reddy on Wednesday joined Telangana Rashtra Samiti (TRS) in the presence of its supremo and chief minister K Chandrasekhar Rao.

సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి

Posted: 07/21/2021 06:06 PM IST
Former huzurabad cong chief kaushik reddy joins trs in kcr s presence

మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానం నుంచి ఈ సారి టీఆర్ఎస్ పార్టీ టికెట్ తనకే లభిస్తుందని మాదన్నపేటకు చెందిన విజేందర్ అనే కార్యకర్తతో మాట్లాడిన ఆడియో కాల్ బయటపడటంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన హుజూరాబాద్ మాజీ కాంగ్రెస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి.. నియోజకవర్గ అభివృద్ది కోసం తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆ మేరకు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

వందలాది మంది కార్యకర్తలతో తెలంగాణ భవన్ కళకళలాడుతున్న నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ రాజకీయాలపై అచితూచి మాట్లాడారు. దుబ్బాకలో జరిగిన పోరబాటు హజురాబాద్ లో జరగకూడదని.. నిత్యం గాంభీర్యంగా ప్రసంగించే ఆయన కాసింత తగ్గి మాట్లాడారు. ఎక్కడ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పేరును ఉచ్చరించకుండా జాగ్రత్త పడుతూ.. కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డి తనకు చిరకాల మిత్రుడని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి సాయినాథ్ రెడ్డి పని చేశారని అన్నారు.

రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కావాలనే ఆకాంక్షతోనే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు గెలవడం, ఓడిపోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని కేసీఆర్ అన్నారు. శాశ్వతంగా ఏ పార్టీ కూడా అధికారంలో ఉండదని చెప్పారు. ఎప్పుడూ అధికారంలో ఉండటానికి ఇది రాచరిక వ్యవస్థ కాదని అన్నారు. టీఆర్ఎస్ లో కౌశిక్ రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ తెలిపారు. కౌశిక్ ను ఎవరూ ఆపలేరని... ఆయన ఉన్నతికి తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కౌశిక్ రెడ్డి బాధ్యతలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : By-Elections  Huzurabad  KoushikReddy  TRS  CM KCR  Congress  Etela Rajender  Telangana Bhavan  Huzurabad  Telangana  Politics  

Other Articles