How can advisors address political press meets.? HC ప్రభుత్వ సలహాదారు నోటి వెంట రాజకీయాలా.?: హైకోర్టు

How can advisors address political press meets high court asks andhra pradesh government

YS Jagan Mohan Reddy, former chief secretary, Nilam Sawhney, AP High Court, Justice Bhattu Devanand, Public Intrest Litigation, Chief Election officier, Political press meet, Advisors, Advocate Regu Umamaheswara Rao, Andhra Pradesh, Politics

The AP high court on Thursday directed the government to file an additional affidavit stating details of advisors appointed by it and the basis of their appointments. The bench of Justice Bhattu Devanand, which heard a PIL challenging the appointment of former chief secretary Nilam Sawhney as state election commissioner, also asked how the advisors can address political press conferences despite taking salary from the government.

ప్రభుత్వ సలహాదారు నోటి వెంట రాజకీయాలా.?: హైకోర్టు

Posted: 07/09/2021 01:35 PM IST
How can advisors address political press meets high court asks andhra pradesh government

ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్న వ్యక్తులు రాజకీయాలు మాట్లాడుతుండటంపై ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సలహాదారులు రాజకీయ నేతల మాదిరి రాజకీయాలపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటమేంటని ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి ప్రజాధనాన్ని వేతనంగా పోందుతూ.. మీడియా ముఖంగా రాజకీయాలు మాట్లాడటం చట్ట వ్యతిరేకం కాదా? అని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ముఖ్య సలహాదారు, రాష్ట్ర సలహాదారుల నియామక విధివిధానాలను, విధులకు సంబంధించిన వివరాలను పొందుపర్చుతూ మరో అదనపు అఫిడెవిట్ ను సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని అదేశించింది.

అంతేకాదు, ముఖ్య సలహాదారులు, సలహాదారుల నియామక ప్రాతిపదకను కూడా అఫిడెవిట్ లో పొందుపర్చాలని అదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి (ఎస్ఈసీ) గా నీలం సాహ్నిని నియమించడాన్ని సవాల్ చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు ఉమామహేశ్వర రావు దాఖలు చేసిన కో-వారెంటో పిటీషన్ ను విచారిస్తూ జస్టిస్ దేవానంద్ బట్టు ఈ మేరకు ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.

పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ, 2020 మార్చి 31న నీలం సాహ్ని సీఎస్ గా పదవీ విరమణ చేశారని... డిసెంబర్ 22న ఆమెను సీఎం ప్రధాన సలహాదారుగా నియమించారని చెప్పారు. అయితే, 2021 మార్చి 27న సలహాదారు పదవికి ఆమె రాజీనామా చేశారని తెలిపారు. ఎస్ఈసీ నియామకానికి సంబంధించి మార్చి 24న రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వం పంపిన మూడు పేర్లలో సాహ్ని పేరు ఉందని... మార్చి 28న ఎస్ఈసీగా ఆమె నియమితులయ్యారని చెప్పారు.

ఈ సందర్భంగా గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ... మీరు అడ్వొకేట్ జనరల్ గా ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారులు మీడియాతో రాజకీయపరమైన అంశాల గురించి మాట్లాడటం చూశారా? అని జస్టిస్ దేవానంద్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా అప్పట్లో అది జరగలేదని ఆయన సమాధానమిచ్చారు. ఈ పిటిషన్ పై సరైన విచారణ జరగాలంటే... సలహాదారుల నియామకం, వారి విధులను పరిశీలించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles