SP Accuses BJP Workers Of Pulling Woman's Saree ఉత్తర్ ప్రదేశ్ లో ఎస్పీ మహిళ చీర లాగిన ప్రత్యర్థులు

Bjp workers pulls woman s saree to stop her from contesting elections

uttar pradesh, uttar pradesh violence, uttar pradesh news, sp, uttar pradesh protests on caa, uttar pradesh top in violence, uttar pradesh communal violence, uttar pradesh police, police beaten in uttar pradesh, uttar pradesh crime, uttar pradesh ki news, uttar pradesh panchayat polls, crime rate in uttar pradesh, uttar pradesh samachar, uttar pradesh election 2021, SP, akhilesh yadav, yogi adityanath

A Samajwadi Party (SP) leader accused BJP workers of pulling the saree of a woman who was her proposer for the Uttar Pradesh Block pramukh elections. Party chief Akhilesh Yadav took to Twitter to condemn the incident and attack Chief Minister Yogi Adityanath over it.

ITEMVIDEOS: ఉత్తర్ ప్రదేశ్ లో ఎస్పీ మహిళ చీర లాగిన ప్రత్యర్థులు

Posted: 07/09/2021 12:36 PM IST
Bjp workers pulls woman s saree to stop her from contesting elections

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఎన్నికల్లో నిలబడుతున్న సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ వ్యక్తి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఓ మహిళకు పరాభవం ఎదురైంది. బీజేపికి చెందిన కొందరు కార్యకర్తలు నడిరోడ్డుపై అమె చీరకొంగు పట్టుకుని లాగి అవమానించారు. అమె చేతిలో బలపర్చే పత్రాలను లాగేసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో మహిళలకు తాము అండగా నిలుస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో చెప్పిన ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ మాటలకు ఈ వీడియో సవాల్ గా నిలుస్తోంది.

వివ‌రాల్లోకి వెళ్తే... లఖింపూర్‌ ఖేరీ ప‌రిధిలో పంచాయతీ ఎన్నికలకు ఓ అభ్యర్థి నామినేషన్‌ను ప్రతిపాదించ‌డానికి స‌మాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ మ‌హిళ నామినేషన్ కేంద్రానికి వెళుతోంది. ఆ స‌మ‌యంలో ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ ప్రత్యర్థులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ చీర కొంగును ప‌ట్టుకుని లాగారు. ఆమె చేతిలోని అభ్యర్థి ప్రతిపాదన పత్రాలను లాక్కున్నారు. దీంతో ఆమెకు మద్ధతుగా కొంద‌రు ముందుకు వ‌చ్చి విడిపించారు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ప‌లు వివ‌రాలు సేక‌రించారు. స‌మాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఎన్నికలో పోటీలో నిల‌వ‌కుండా చేసి త‌మ అభ్య‌ర్థిని ఏకగ్రీవం చేసేందుకే వాళ్లు ఆమెపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసుల బలగాలు పనితీరు ఏమో కానీ, ప్రత్యర్థి పార్టీల మహిళా కార్యకర్తలపై బీజేపీ కార్య‌క‌ర్త‌ల ఆగడాలు రాష్ట్రంలో శృతిమించిపోయాయని సమాజ్‌వాదీ పార్టీ నేత‌లు అరోపిస్తున్నారు. అధికార దాహంతోనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు చెందిన గూండాలు ఇటువంటి దారుణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. మ‌హిళ‌పై దారుణానికి పాల్ప‌డిన ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. యూపీలో 825 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samajwadi Party  akhilesh yadav  yogi adityanath  BJP  Panchayat Elections  Uttar Pradesh  Politics  

Other Articles