Etela Rajender questions KCR on Cabinet Ministers ఉద్యమం అంటే తెలియని వారికి పదవులు: ఈటెల

Former trs minister etela rajender questions kcr on cabinet ministers

Etela Rajender, former Health Minister, BJP, few ministers doesnt know telangana movement, Telangana agitation, Telangana movement, Seperate State, CM KCR, Cabinet Ministers, Telangana, Politics

Former Telangana Health Minister Etela Rajender question Telangana Chief MInister KCR on few MLAs who placed berth in his Cabinet, does they know about Telangana Seperate State Movement.

ఉద్యమం అంటే తెలియని వారికి పదవులు: ఈటెల

Posted: 07/09/2021 02:28 PM IST
Former trs minister etela rajender questions kcr on cabinet ministers

టీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాక మాజీ మంత్రి ఈటల రాజేందర తరచూ గులాబీ పార్టీ బాస్ పైనా ఆ పార్టీ నేతల మీద తరచు విమర్శలు చేస్తునే ఉన్నారు. తెలంగాణ క్యాబినెట్ భర్త్ లో తెలంగాణ ఉద్యమం అంటే ఏంటో తెలియని వ్యక్తులకు కూడా స్థానం లభించిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం జైళ్లకు వెళ్లి, పోరాటాలు చేసిన తాము పదవులు పోయి బయట వున్నామని వ్యంగంగా మాట్లాడారు. తాను నోరు విప్పి నిజాలు చెప్పినందుకే తన పదవి పోయిందనీ.. నోరు విప్పకుండా మిగతావారిలా మౌనంగా ఉండి ఉంటే తాను పదవిలో కొనసాగేవాడినని అన్నారు.

తనకు టికెట్ ఇచ్చినవాళ్లే తనను ఓడించాలని చూశారని గతంలో జరిగిన కొన్ని ఘటనలను ఈటల ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసి ఉద్యమ పోరాటంలో తన మీద ఎన్నో కేసులు పెట్టారని జైలుకు కూడా తాను వెళ్లి వచ్చానని కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నకొంతమంది నాయకులకు ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేదు. వారికి ఉద్యమం అంటే ఏంటో తెలీదని అన్నారు. కానీ వారికి పదవులు లభించాయి. వారిని తన క్యాబినెట్ లోకి కూడా ముఖ్యమంత్రి తీసుకున్నారని ఆయన దుయ్యబట్టారు.

కరీంనగర్ మంత్రి ఏనాడైనా జైలుకు వెళ్లి వచ్చాడా? ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నారా? అంటూ మంత్రి గంగుల కమలాకర్ ను ఉద్ధేశించి ఈటల విమర్శలు కురిపించారు. తెలంగాణ ఉద్యమంలో ఇడ్లీ సాంబరు అమ్ముకుని బతకితే తమకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రజలను విమర్శించిన కేసీఆర్ ఇవాళ వారిని ఎలా ఓట్లు అడుతున్నారని ప్రశ్నించారు, ఇక ఆంధ్ర ప్రాంత నేతలను.. కాంట్రాక్టర్లను నోటికి వచ్చినట్లు దూషించిన కేసీఆర్ వారితోనే చేతులు కలిపి తెలంగాణ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని అరోపించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్ల వద్ద, నేతల వద్ద తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.

తాను హుజారాబాద్ నియోజక వర్గం నుంచి గెలుపొంది ఆ నియోజక వర్గానికి ఎంతో అభివృద్ధి చేశాననీ..అందుకే హుజూరాబాద్ ప్రజలకు తానంటే ఎంతో అభిమానమన్నారు. తనకు వారెప్పుడూ మద్ధతుగా ఉంటారని తెలిపారు. ఇప్పుడు తన మద్ధతుదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. హుజారాబాద్ ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పుడు వారి కోసం అవి చేస్తాం ఇవి చేస్తామని నమ్మిస్తున్నారని దీంట్లో భాగంగానే కులసంఘాల భవనాలు, పెన్షన్లు ఇచ్చి ఆకట్టుకుంటున్నారని ఈటల విమర్శించారు. ఇప్పటి వరకూ లేనివి ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఓటు బ్యాంకు కోసమేనని అన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుంటే హుజూరాబాద్ లో అస్సలు ఏమంత్రి అయినా అడుగుపెట్టేవారా? కానీ ఇప్పుడు మాత్రం ప్రజల్ని మభ్య పెట్టటానికి మంత్రులు హుజూరాబాద్ లో పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Etela Rajender  Telangana movement  Seperate State  CM KCR  Cabinet Ministers  Telangana  Politics  

Other Articles