Microsoft Issues Serious Windows 10 Upgrade Warning విండోస్ 7, 10 లను వెంటనే అప్ డేట్ చేసుకోండి: మైక్రోసాఫ్ట్

Microsoft issues emergency update for printnightmare security flaw

windows 10, windows 7, windows 8.1, windows server security updates, printnightmare, print spooler vulnerability, fix microsoft windows update, windows printnightmare, printnightmare, windows print spooler, microsoft, windows security update, windows, Crime

Microsoft has released security updates for Windows users to patch a security flaw impacting the Windows Print Spooler service. The vulnerability called “PrintNightmare,” that was discovered last week, allows attackers to remotely execute malicious code with system privileges and install programs, make changes in the existing programs, and create new accounts with full user rights

విండోస్ 7, 10 లను వెంటనే అప్ డేట్ చేసుకోండి: మైక్రోసాఫ్ట్

Posted: 07/09/2021 11:29 AM IST
Microsoft issues emergency update for printnightmare security flaw

కంపూటర్లను వినియోగిస్తున్న వారికి మైక్రోసాఫ్ట్ అత్యవసర అదేశాలను జారీ చేసింది. కంపూటర్ల వినియోగంలో తమ ఆపరేటింగ్ సిస్టంను వినియోగిస్తున్న కస్టమర్లకు అప్రమత్తం చేస్తూ అలర్ట్ నెస్ ప్రకటించింది. తమ ఓఎస్ లలో లోపం బయటపడడంతో విండోస్ వినియోగదారులందరూ వెంటనే తమ కంప్యూటర్లను అప్ డేట్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ కోరింది. తమ ఓఎస్ లో తలెత్తిన లోపాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ హ్యాకర్లు చెలరేగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీనిని అడ్డుకునేందుకు వెంటనే అప్ డేట్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచించింది.

విండోస్ లోని ‘ప్రింట్ స్పూలర్ లో భద్రతా పరమైన లోపాలు ఉన్న విషయాన్ని తాము గుర్తించామని గతేడాది మేలో ‘సాంగ్ ఫర్’ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రకటించింది. ప్రింట్ స్పూలర్ అనేది ఒకే ప్రింటర్ ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు సాయపడుతుంది. ప్రింట్ స్పూలర్ లో లోపాలను గుర్తించిన సాంగ్ ఫర్.. దానిని ఎలా హ్యాక్ చేయొచ్చన్న వివరాలను పొరపాటున ఆన్ లైన్ లో పెట్టేసింది. ఆ వెంటనే పొరపాటును గుర్తించి డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అది చాలామందికి చేరిపోయింది.

‘ప్రింట్ నైట్‌మేర్ గా పిలుస్తున్న ఈ లోపాన్ని హ్యాకర్లు ఉపయోగించుకుని ఇతరుల కంప్యూటర్లలోని డేటాను చూడడం, డిలీట్ చేయడం, కొత్త యూజర్ అకౌంట్లను సృష్టించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. విండోస్ 10, విండోస్ 7లోనూ ఈ లోపం ఉందని పేర్కొన్న మైక్రోసాఫ్ట్ వీటికోసం అప్‌డేట్‌లను విడుదల చేసింది. వాస్తవానికి విండోస్ 7 అప్ డేట్స్ ను ఆపేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ గతేడాదే ప్రకటించింది. అయితే, తాజా లోపం నేపథ్యంలో దానికి కూడా అప్ డేట్ ను విడుదల చేసింది. యూజర్లు అందరూ తప్పకుండా అప్ డేట్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా హ్యాకర్ల ముప్పు లేకుండా చూసుకోవాలని కోరింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : windows 10  windows 7  windows 8.1  printnightmare  windows print spooler  microsoft  windows  Crime  

Other Articles