MMTS tickets instead of Platform tickets at Secundrabad Station సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఫ్లాట్ ఫాం టికెట్ ఆదాయానికి గండి.!

Passengers prefer mmts tickets instead of platform tickets at secundrabad railway station

covid-19 infections, platform ticket, railway platforms, secunderabad railway station, south central railway, corona vaccine, Covid-19, Covaxin, Covishield, Hyderabad, Telangana, Politics

To avoid over-crowding at railway platforms and to contain the spread of Covid-19 infections, the rate of platform ticket at Secunderabad railway station has been enhanced from present Rs 30 to Rs 50 since April 13, but passengers are buying MMTS rail tickets instead, to save money.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఫ్లాట్ ఫాం టికెట్ ఆదాయానికి గండి.!

Posted: 07/03/2021 05:12 PM IST
Passengers prefer mmts tickets instead of platform tickets at secundrabad railway station

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ అదాయానికి ఫ్లాట్ ఫాం టికెట్‌ ధరలు గండికొట్టిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ రైల్వే స్టేషన్లోకి ప్రయాణికులతో పాటు వారిని దింపడానికి అధిక సంఖ్యలో ఎవరూ రాకుండా చేయడానికి ఈ స్టేషన్ తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ల ధరను దక్షిణ మధ్య రైల్లే ఏప్రిల్ 13న రూపాయలు 30 నుంచి రూ.50కి పెంచిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు రూ. 10గా వున్న ధరను రూ.30 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏకంగా ఫ్లాట్ ఫాం ధర రూ.50కి చేరింది.

దీంతో గత్యంతర లేని పరిస్థితుల్లో జూన్ 23 వరకు ఫ్లాట్ ఫాం టికెట్లు తీసుకున్నవారు.. ఆ రోజు నుంచి సికింద్రాబాద్ ఫ్లాట్ ఫాం టికెట్ల ఆదాయానికి గండికొడుతున్నారు. ఫ్లాట్ పాం ధరలు..ఆర్టీసీ బస్సులు, లోకల్‌ రైళ్ల కంటే నాలుగైదింతలు అధికంగా ఉండడంతో హడలిపోతున్న ప్రయాణికులు జూన్ 23 నుంచి కేవలం ఐదు రూపాయల ఖరీదు చేసే ఎంఎంటీఎస్ రైళ్ల టికెట్లు కొని స్టేషన్లోకి వెళ్లి తమ బంధువులకు పంపి తిరుగు పయనం అవుతున్నారు. కొండనాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభమైన తరువాత కూడా ఈ ధరలు పెట్టి ప్లాట్ ఫాం టికెట్ కొనుగోలు చేసే కన్నా ఎంఎంటీఎస్ టికెట్ కొంటున్నవారి సంఖ్య పెరిగింది.

పండుగ వేళల్లో రైళ్లలో, స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉండడంతో రెండేళ్ల క్రితం రూ.10 ఉన్న టికెట్‌ ధరను రూ.30 పెంచారు. ఇక ఏప్రిల్ 13 నుంచి ధీని ధర ఏకంగా రూ.50కి పెంచారు. అయితే ఫ్లాట్ ఫాం టికెట్ ఏకంగా రూ. 50 పెట్టి కొన్నా దాని వినియోగం మాత్రం కేవలం రెండు గంటలు మాత్రమే పరిమితం కానుంది. అయితే అదే సమయంలో ఎంఎంటీఎస్ రైల్వే టికెట్ ను అటు సీతాఫల్ మండీ లేదా ఇటు బేగంపేట్ కు కొన్న పక్షంలో కేవలం రూ.5కే అందుబాటులోకి రానుంది. ఇక దీంతో పాటు దాని కాల పరిమితి కూడా మూడు గంటలు. మరోవైపు డబ్బులు కూడా అదా అవుతన్న క్రమంలో అందరూ ఎంఎంటీఎస్ రైళ్ల టికెట్లకే ప్రాధాన్యతనిస్తూ ఫ్లాట్ ఫాం టికెట్ ఆదాయానికి గండి కొడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles