Homeless Beggars Should Work: Bombay HC దేశాభ్యున్నతిలో వాళ్లు భాగం కావాలన్న బాంబే హైకోర్టు

Govt can t provide everything homeless beggars should work says bombay hc

Bombay High Court, adoption, Beggars Work, Homeless, Bombay HC, Brihanmumbai Municipal Corporation, BMC, Brijesh Aarya

The Bombay High Court said that homeless persons and beggars should also work for the country as everything cannot be provided to them by the state. A division bench of Chief Justice Dipankar Datta and Justice G S Kulkarni said this while disposing of a public interest litigation (PIL) filed by one Brijesh Aarya.

వారికి మూడుపూటలా పోషకాహారం కావాలంలే కుదరదు: బాంబే హైకోర్టు

Posted: 07/03/2021 06:23 PM IST
Govt can t provide everything homeless beggars should work says bombay hc

నిరాశ్రయులు, యాచకులు కూడా దేశ అభ్యున్నతిలో తమవంతు కష్టం చేయాలని మహారాష్ట్రోన్నత న్యాయస్థానం బాంబే హైకోర్టు సూచనలు చేసింది. దేశ కోసం పని చేయాని, వారికి ప్రభుత్వం ఎలా అన్నింటినీ సమకూర్చుతుందని ప్రశ్నించింది. అలా సమకూర్చడం సాధ్యం కాదని హైకోర్టు తెలిపింది. బ్రిజేష్ ఆర్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణి డివిజన్ బెంచ్ ఇవాళ ఈ వ్యాఖ్యలు చేసింది.

ముంబై నగరంలోని నిరాశ్రయులు ఇతర పేదలకు రోజుకు మూడు పూటలా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని, సురక్షితమైన తాగు నీటిని అందజేయాలని, ఆశ్రయాన్ని, పరిశుభ్రమైన మరుగుదొడ్లను అందుబాటులోకి తేవాలని బృహన్ముంబై నగర పాలక సంస్థ (బీఎంసీ)ని ఆదేశించాలని కోరారు. దీనిపై బీఎంసీ స్పందిస్తూ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో సమాజంలోని ఇటువంటి వర్గాలవారికి ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. ఈ వర్గాల్లోని మహిళలకు శానిటరీ నాప్‌కిన్స్ ను అందజేస్తున్నట్లు వివరించింది.

బీఎంసీ ఇచ్చిన సమాచారంతో హైకోర్టు సంతృప్తి చెందింది. నిరాశ్రయులు కూడా దేశం కోసం పని చేయాలని తెలిపింది. ప్రతివారూ పని చేస్తున్నారని, ప్రతిదాన్నీ రాజ్యం అందజేయడం సాధ్యం కాదని తెలిపింది. సమాజంలో ఈ వర్గం జనాభాను పిటిషనర్ పెంచుతున్నారని వ్యాఖ్యానించింది. పిటిషన్ లో పేర్కొన్న వాటినన్నింటినీ మంజూరు చేయడమంటే, పని చేయకండని ప్రజలకు చెప్పడమే అవుతుందని వ్యాఖ్యానించింది. నిరాశ్రయులు బహిరంగ మరుగుదొడ్లను ఉచితంగా ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించడంపై పరిశీలించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles