Pushkar Singh Dhami is new Uttarakhand CM ఉత్తరాఖండ్ నూతన సీఎంగా పుష్కర్ సింగ్ ధామి

Pushkar singh dhami to be youngest uttarakhand chief minister

Pushkar Singh Dhami, Who is Pushkar Singh Dhami, Uttarakhand New Chief Minister, New Chief Minister Uttarakhand, Uttarakhand CM, Uttarakhand CM news, Uttarakhand news, Pushkar Singh Dhami age, uttarakhand cm, uttarakhand cm news, uttarakhand news, uttarakhand chief minister, uttarakhand new cm, pushkar singh dhami

Pushkar Singh Dhami, the 45-year-old new Chief Minister of Uttarakhand, is the hill state's youngest ever Chief Minister. Previously, Ramesh Pokhriyal Nishank became the youngest leader in the top job when he became Chief Minister at age 49.

ఉత్తరాఖండ్ నూతన సీఎంగా యువనేత.. పుష్కర్ సింగ్ ధామి

Posted: 07/03/2021 04:13 PM IST
Pushkar singh dhami to be youngest uttarakhand chief minister

ఉత్తరాఖండ్ రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ  బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన శనివారం బీజేపీ శాసనసభా పక్షం సమావేశమైంది. ఈ సమావేశంలోనే ఎమ్మెల్యేలందరూ పుష్కర్ సింగ్‌ను ఎన్నుకున్నారు. పుష్కర్ సింగ్ ఖటీమా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సీఎం తీరథ్ సింగ్ రాజీనామా చేయగానే కొందరి పేర్లు ముఖ్యమంత్రి రేసులో ముందుకు వచ్చాయి. సత్‌పాల్ సింగ్, ధన్‌సింగ్ రావత్ పేర్లు ప్రముఖంగా సీఎం రేసులో వినిపించాయి. అయితే వీరిద్దర్నీ కాదని, అధిష్ఠానం పుష్కర్ సింగ్ ధామీని సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.

భార‌తీయ జ‌న‌తాపార్టీ ఒక సాధార‌ణ కార్య‌క‌ర్త‌కు ముఖ్య‌మంత్రి పీఠం క‌ట్ట‌బెట్టింద‌ని ఉత్త‌రాఖండ్ నూత‌న ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్న పుష్క‌ర్‌సింగ్ ధామి అన్నారు. ప్ర‌జా సంక్షేమం కోసం ప్ర‌భుత్వంలో అంద‌రం క‌లిసిక‌ట్టుగా ప‌నిచేస్తామ‌ని ఆయ‌న చెప్పారు. నాకు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసేందుకు నిండా ఏడాది కూడా స‌మ‌యం లేద‌ని, ఇంత త‌క్కువ కాలంలోనే ఇత‌ర నాయ‌కుల సాయంతో ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం స‌వాలు లాంటిద‌ని, ఆ స‌వాలును తాను స్వీక‌రిస్తున్నాన‌ని ధామి వ్యాఖ్యానించారు.

కాగా, పుస్క‌ర్ సింగ్ ధామి పితోగ‌ఢ్‌లో జ‌న్మించారు. ఆ త‌ర్వాత రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేసి రెండు సార్లు ఎమ్మ‌ల్యేగా గెలించారు. ఉద్ధ‌మ్‌సింగ్ న‌గ‌ర్ జిల్లాలోని ఖతిమా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అంత‌కుముందు ధామి ఉత్త‌రాఖండ్ మాజీ ముఖ్య‌మంత్రి కోశ్యారీ ద‌గ్గ‌ర ఓఎస్‌డీగా ప‌నిచేశారు. కాగా, ఈ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఉత్త‌రాఖండ్‌లోని బీజేపీ హెడ్ క్వార్ట‌ర్స్‌లో బీజేఎల్పీ స‌మావేశంలో జ‌రిగింది. ఆ స‌మావేశంలో ఎమ్మెల్యేలంతా క‌లిసి ప్ర‌కాష్‌సింగ్ ధామిని త‌మ నాయ‌కుడిగా ఎన్నుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pushkar Singh Dhami  New Chief Minister  Uttarakhand  Tirath Singh Rawat  Politics  

Other Articles