Vaccination drive picks pace in Hyderabad జీహెచ్ఎంసీ పరిధిలో వేగం పుంజుకున్న వాక్సీనేషన్ డ్రైవ్

Vaccination drive picks pace in hyderabad

GHMC Vaccination Drive, 100 vaccination centres, corona vaccine, Covid-19, Covaxin, Covishield, Hyderabad, Telangana, Politics

The administration of Covid-19 vaccine for people over 18 years of age is underway at 100 locations in the GHMC limits. On an average, 48,000 people are being administered with the free jab every day in these centres. Scores of people were seen thronging these centres.

జీహెచ్ఎంసీ పరిధిలో వేగం పుంజుకున్న వాక్సీనేషన్ డ్రైవ్

Posted: 07/03/2021 03:07 PM IST
Vaccination drive picks pace in hyderabad

దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ఎప్పుడో ప్రకటించినా, టీకాల కొరతతో ఇప్పటివరకు అది సాధ్యం కాలేదు. ఇక త్వరలో ధర్డ్ వేవ్ వస్తుందన్న నిపుణుల హెచ్చరికలతో పాటు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ కు సంబంధించిన డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు కూడా బయటపడటం.. పలు రాష్ట్రాల్లో ఈ కరోనా వేరియంట్ సోకిన రోగులు కూడా మృత్యువాత పడటంలో దేశప్రజల్లో అందోళన తారాస్థాయికి చేరింది. అయితే దీని నుంచి బయటపడటానికి వాక్సీనేషన్ ఒక్కటే మార్గమని ప్రపంచ అరోగ్య సంస్థ సూచించింది.

దీంతో ఇక అందరి దృష్టి వాక్సీనేషన్ పై పడింది. ఈ క్రమంలో లాక్ డౌన్ నేపథ్యంలోనూ ఔషధ కంపెనీలు ఓవర్ టైం చేసి మరీ కోట్ల కొద్దీ వాక్సీన్ డోసులను తయారు చేయడంలో ఇక అన్ లాక్ తరువాత వాక్సినేషన్ ప్రక్రియను తరిిగి ప్రారంభించిన ప్రభుత్వాలు.. తోలుత 45 ఏళ్లకు పైబడిన వారికే కరోనా వ్యాక్సిన్ డోసులు ఇస్తూ వచ్చారు. ఇకపై 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేకంగా యువత కోసం 100 కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది.

ఈ కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు వ్యాక్సిన్ డోసులు వేస్తారు. ఈ కేంద్రాల్లో ఉచితంగానే టీకాలు వేస్తారు. దీనిపై జీహెచ్ఎంసీ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ స్పందిస్తూ, 18 ఏళ్లకు పైబడిన వారు తమకు సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రాలను సందర్శించాలని పిలుపునిచ్చారు. ముందుగా కొవిన్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకున్న తర్వాత, వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళితే వేచి చూడాల్సిన అవసరం లేకుండా వెంటనే టీకా వేస్తారని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles