First death from Delta-Plus Covid-19 variant మధ్యప్రదేశ్ లో డెల్టాప్లస్ వేరియంట్ తొలి మరణం..

Covid 19 first death from delta plus variant in madhya pradesh ujjain district

corona delta plus death, Delta Plus variant, COVID-19, Ujjain district, Delta Plus variant death, Madhya Pradesh Delta Plus, MP Delta Plus death, Delta plus variant in India, MP delta plus variant death, First Death India, Ujjain, Bhopal, Madhya Pradesh

Madhya Pradesh reported its first death of a patient identified with the Delta plus variant of Covid-19 in Ujjain district. Five confirmed cases of Delta-Plus variant has so been reported in the state — three from Bhopal and two others from Ujjain district.

డెల్టాప్లస్ వేరియంట్ తొలి మరణం.. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో రోగి మృతి

Posted: 06/24/2021 12:31 PM IST
Covid 19 first death from delta plus variant in madhya pradesh ujjain district

దేశవ్యాప్తంగా అన్నివర్గాల ప్రజలను ప్రస్తుతం అందోళనకు గురిచేస్తున్నది కరోనా మహమ్మారి. ఇప్పటివరకు వచ్చిన రెండు వేరియంట్ల కన్నా అత్యంత అపాయకరమైన వేరియంట్ గా కేంద్రం పరిగణిస్తున్న వేరియంట్ డెల్టాప్లస్. కరోనా మూడవ దశలో దేశప్రజలను పట్టి పీడించేది ఈ వేరియంటేనని.. ఇది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికీ దేశంలో తీవ్రంగా వ్యాపిస్తుందని ఇప్పటికే వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇక కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్లకు స్వస్తిపలికి అన్ లాక్ చేస్తున్న నేపథ్యంలోనూ వైద్యరంగ నిపుణలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజారోగ్యం కన్నా ప్రభుత్వాలకు ఆర్థికంగా సుభిక్షంగా వుండటమే పరమావధిగా మారిందా.? అంటూ ప్రశ్నిస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తీవ్రవ్యాప్తికి చేరే థర్డ్ వేవ్ అప్పుడే మూడు రాష్ట్రాలకు పాకిందన్న వార్తల నేపథ్యంలో అన్ లాక్ చేయవద్దని కూడా కోరుతున్నారు. ఈ క్రమంలో వారి అందోళనలను నిజం చేస్తూ దేశంలో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ నమోదైంది. దేశంలోనే కరోనా డెల్టాప్లస్ వేరియంట్ తో నమౌదైన తొలి మరణం ఇది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ జిల్లాలో ఈ మరణం నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది.

ఉజ్జయినిలోని పటిదార్ అసుపత్రిలో కరోనా మహమ్మారి సోకి చేరిన ఓ మహిళ చికిత్స పోందుతూ మరణించింది. ఈ రోగి నుంచి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా అది డెల్టా ప్లస్ వేరియంట్ అది డెల్టాప్లస్ వేరియంట్ గా తేలిందని వైద్యాధికారులు తెలిపారు. ఈ మేరకు అమె నమూనాల నివేదికలు దృవీకరించాయన్నారు. కాగా, తమ రాష్ట్రంలో ఐదుగురికి డెల్టాప్లస్ వైరస్ సోకింది. అందులో నలుగురు కోలుకున్నారని, ఒక మహిళా రోగి మరణించారని ఉజ్జయిని నోడల్ అధికారి చెప్పారు. అందులో ముగ్గురు భోపాల్ కు చెందినవారు ఉండగా, మరో ఇద్దరు ఉజ్జయినికి చెందినవారని తెలిపారు.  

కాగా, సార్ట్ కొవిడ్-2 డెల్టా ప్లస్ వేరియంట్ ప్రబలిన నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యశాఖ మంత్రి విశ్వస్ సారంగ్ చెప్పారు. డెల్టా ప్లస్ వేరియంట్ రోగుల కాంటాక్టు ట్రేసింగ్ జరుగుతుందన్నారు. ఈ వైరస్‌ సోకిన ఐదుగురిలో నలుగురు వ్యాక్సిన్ వేయించుకున్నారని, వారంతా కోలుకున్నారని, కానీ టీకా తీసుకోని రోగి మరణించారని వెల్లడించారు. అర్హులైనవారంతా టీకాలు వేయించుకోవాలని ఆయన కోరారు. కాగా, ఉజ్జయినీ జిల్లా కలెక్టర్ అశీష్ సింగ్ ఈ వార్తలపై స్పందిస్తూ.. తమ జిల్లాలో డెల్టాప్లస్ వేరియంట్ ముప్పు లేదని, అయినా ప్రజలందరూ మాస్కులు ధరించి.. చేతులు కడుక్కుంటూ వుండాలని సూచిస్తున్నామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles