KRMB instructs AP govt to stop construction కేఆర్ఎంబి అదేశాలతో రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ పనులకు బ్రేక్..

Krmb considers ts objection instructs ap govt to stop construction

andhra pradesh (ap) government, central water commission (cwc), detailed project report (dpr), krishna river management board (krmb), rayalaseema lift irrigation scheme (rlis), telangana state government, AP Govt, River Krishna, Rayalaseema lift irrigation, KRMB, andhra pradesh, Telangana, National Green Tribunal, Politics

The Krishna River Management Board has instructed the Andhra Pradesh government not to take up the construction of the proposed Rayalaseema Lift Irrigation Scheme till a Detailed Project Report is submitted and appraised by the board and Central Water Commission.

కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆదేశాలు.. రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ పనులకు బ్రేక్..

Posted: 06/24/2021 01:33 PM IST
Krmb considers ts objection instructs ap govt to stop construction

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అక్ర‌మంగా నిర్మిస్తున్న రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం పనులకు బ్రేక్ పడింది. ఈ పనులను తక్షణం నిలిపివేయాలని కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కొనసాగిస్తోందని తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై స్పందించిన బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పనులను అపాలని అదేశాలను జారీ చేసింది. ఈ మేరకు లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌నులు త‌క్ష‌ణ‌మే ఆపాలంటూ లేఖ రాసిన బోర్డు అందులో ఈ అదేశాలను పేర్కోంది.

నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ ( ఎన్జీటీ ) గ‌త ఫిబ్ర‌వ‌రిలో ఇచ్చిన ఆదేశాల‌లో రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌నులు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని స్ప‌ష్టంగా చెప్పార‌ని కృష్ణా న‌ది యాజమాన్య బోర్డు లేఖ‌లో ప్ర‌స్తావించింది. కేఆర్ఎంబీ నిపుణుల క‌మిటీ ప‌ర్య‌ట‌న‌కు ఏపీ ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించ‌డం లేదు. దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. అయితే రాయలసీమ లిప్టు ఇరిగేషన్ పనులపై డీటైయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) స‌మ‌ర్పించిన తరువాత ఈ పనులు ప్రారంభించాలని సూచించింది.

అయితే ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్ లు ఆంధ్రప్రదేశ్ రివర్స్ యాక్ట్-2014 ప్రకారం సెంట్రల్ వాటర్ కమీషన్ (సిడబ్యూసీ)తో పాటుగా అపెక్స్ కౌన్సీల్ ఆమోదం పొందాలని కూడా సూచించింది. అప్పటి వ‌ర‌కు రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌నులు ముందుకు వెళ్లొద్దు అని ఏపీ ప్ర‌భుత్వానికి కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు స్ప‌ష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటర్ రిసోర్సెస్ డిపార్డుమెంటు కార్యదర్శికి కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సభ్యుడు హెచ్ఆర్ మీనా లేఖ రాస్తూ.. రాయలసీమ లిప్టు ఇరిగేషన్ పనులపై అందిన పిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చట్టరిత్యా ట్రిబ్యూనల్ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని ప్రస్తావించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles