Need more data on ‘Delta Plus’ variant: AIIMS chief కరోనా వేరియంట్ల నియంత్రణ ఈ మూడింటితోనే సాధ్యం: గులేరియా

Need more data on delta plus variant to gauge its seriousness aiims chief

COVID-19, Coronavirus, AIIMS Director, Dr Randeep Guleria, Delta Plus COVID Variant, Delta Plus variant, COVID-19 third wave, corona vaccine, National, Health, Medical Emergency

AIIMS Director Randeep Guleria has said India needs more data on the Delta Plus variant to gauge its seriousness. This statement from the AIIMS chief came after the Union government called Delta Plus a ‘Variant of Concern’. The World Health Organization (WHO) has also said that the highly transmissible strain of COVID-19 is expected to become a “dominant lineage” if current trends continue.

కరోనా వేరియంట్ల నియంత్రణ ఈ మూడింటితోనే సాధ్యం: గులేరియా

Posted: 06/24/2021 11:28 AM IST
Need more data on delta plus variant to gauge its seriousness aiims chief

కరోనా మహహ్మారి తన రూపును మార్చుకుని మూడవదశలో దేశప్రజలపై మరింతగా విరుచుకుపడుతుందన్న అందోళనల నేపథ్యంలో దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని.. మరింత డేటా లభించిన తరువాత మాత్రమే డెల్టా ప్లస్ వేరియంట్, దాని తీవ్రత, వ్యాప్తి విషయాలపై మాట్లాడవచ్చునని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా ధర్డ్ వేవ్‌ ముప్పు ఉందన్న విషయమై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ ఇది రెండో దశ కన్నా మరింత తీవ్రంగా వుంటుందన్న వార్తలు కూడా వినబడుతున్న తరుణంలో ఆయన దీనిపై స్పందించారు.

రెండో వేవ్‌లో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే బయటపడుతున్న భారత్ లో మూడో వేవ్‌పై తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ తరుణంలో కేంద్రం డెల్టా ప్లస్ వేరియంట్ ను తీవ్రతరమైన వేరియంట్ గా గుర్తించింది. ఈ నేపథ్యంలో గులేరియా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డెల్టాప్లస్‌ వేరియంట్‌ దేశంలో ఇబ్బందులు సృష్టిస్తోందని చెప్పడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఏ కరోనా వేరియంట్‌నైనా సంబంధిత ప్రోటోకాల్‌, లాక్ డౌన్‌, వ్యాక్సినేషన్లతో సమర్థంగా నియంత్రించగలమని ఆయన తెలిపారు. అయితే, స్థైర్యాన్ని మాత్రం కోల్పోవద్దన్నారు. ఎక్కడ కేసులు వెలుగులోకి వచ్చినా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మూడో వేవ్‌ రాకుండా అప్రమత్తంగా ఉంటూ కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించాలన్నారు.

అయితే, క్రమంగా పాఠశాలలు తెరవడంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించాలని గులేరియా సూచించారు. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. దశలవారీగా తరగతుల్ని ప్రారంభించాలన్నారు. ఇక వ్యాక్సినేషన్‌ విషయానికి వస్తే భారత్‌లో ఇంకా వృద్ధులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. పిల్లల కోసం వ్యాక్సిన్లు సిద్ధమవుతున్నాయని.. సెప్టెంబరు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక వైరస్‌ క్రమక్రమంగా రూపాంతరం చెందుతూనే ఉంటుందని.. వాటిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. వేగంగా వ్యాపిస్తేనే వాటిని ఆందోళనకర రకాలుగా గుర్తిస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Covid Third wave  AIIMS  Randeep Guleria  Delta Plus variant  COVID-19  WHO  Coronavirus  National  

Other Articles