Telangana caps cost of Covid-19 treatment at private hospitals కరోనా చికిత్స, పరీక్షలకు ధరలను నిర్థారించిన ప్రభుత్వం

Telangana caps cost of covid 19 tests treatment at private labs and hospitals

Telangana government, TS government caps covid treatment, ts gov caps covid diagnosis, TS gov caps ambulance charges, Ts government private hospitals, TS government ICU charges with Ventilator, TS gov ICU charges without Ventilator, TS gov normal ward charges per day, covid-19 patients, diagnostic investigations, high resolution ct (hrct), telangana govt

Telangana gobernment caps cost of Covid-19 tests, treatment at private labs and hospitals. The bed charges in private hospitals cannot exceed Rs 4,000 per day in normal wards, Rs 7,500 in Intensive Care Units (ICU) without ventilator and Rs 9,000 with ventilator support.

కరోనా చికిత్స, పరీక్షలకు ధరలను నిర్థారించిన ప్రభుత్వం

Posted: 06/23/2021 12:50 PM IST
Telangana caps cost of covid 19 tests treatment at private labs and hospitals

క‌రోనా రోగుల నుంచి అందిన‌కాడికి దోచుకుంటున్న ప్రైవేటు ఆస్ప‌త్రుల దోపిడీకి తెలంగాణ ప్ర‌భుత్వం ఎట్టకేలకు అడ్డుక‌ట్ట వేసింది. తొలిదశతో పాటు రెండవ దశలోనూ ప్రవేటు అసుపత్రులు చేరిన రోగుల కుటుంబాలను భయాందోళనలకు గురిచేసి వారి నుంచి లక్షలాధి రూపాయలను వసూలు చేశాయి,  ఈ మేరకు పలువురు రోగులు మీడియాకు తమ ఆవేదనలను కూడా చెప్పుకున్నారు. ఎంతగానో తమను కష్టపెట్టినా చివరకు తమ వారిని చూడటానికి కూడా అనుమతించకుండా చర్యలు తీసుకున్నాయని కూడా అరోపించారు. మరీ ముఖ్యంగా నగరాల్లోని కార్పోరేట్, ప్రైవేటు, చైన్డ్ అసుపత్రుల ఆడగాలకు అడ్డులేకుండా పోయింది.

అసలు ఆసుపత్రులలో ఏ రకమైన వైద్యం ఇస్తున్నారో కూడా తెలియకుండా లక్షల రూపాయలను వసుళ్లు చేసిన ప్రైవేలు అసుపత్రులు తమ వారి మృతదేశాలనే అప్పగించాయి తప్ప ప్రాణాలతో తమవారిని అప్పగించలేదన్న అరోపణలు కూడా మనం విన్నాం. కరోనా కష్టకాలంలో రోగులను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన వైద్యులు.. కార్పోరేట్, ప్రైవేటు అసుపత్రుల చేతుల్లో కీలుబోమ్మలై.. వారు చెప్పినట్లుగానే రోగుల కుటుంబసభ్యులను భయాందోళనకు గురిచేసి లక్షల రూపాయలను వారి నుంచి పిండేశాయన్న అరోపణలు వున్నాయి. ఈ క్రమంలో రోగుల బంధువులు, కుటుంబసభ్యలు నుంచి తీవ్రస్థాయిలో పిర్యాదులు వెల్లువెత్తిన క్రమంలో ఎట్టకేలకు ప్రభుత్వం కదిలి చర్యలు తీసుకుంది.

చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకన్న చందంగా వున్నా.. మూడో దశ కరోనా వస్తుందన్న నేపథ్యంలోనైనా ఈ ధరలు ప్రజలకు మేలు కలిగేలా చేయనున్నాయి. ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో క‌రోనా చికిత్స‌లు, ప‌రీక్ష‌ల గ‌రిష్ట ధ‌ర‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు క‌రోనా చికిత్స ఛార్జీల‌పై వైద్యారోగ్య శాఖ జీవో 40 జారీ చేసింది. సాధార‌ణ వార్డులో ఐసోలేష‌న్‌, ప‌రీక్ష‌ల‌కు రోజుకు గ‌రిష్టంగా రూ. 4 వేలు, ఐసీయూ వార్డులో రోజుకు గ‌రిష్టంగా రూ. 7,500 వ‌సూలు చేయాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్న‌ది. వెంటిలేట‌ర్‌తో కూడిన ఐసీయూ గ‌దికి రోజుకు గ‌రిష్టంగా రూ. 9 వేలుగా ఖ‌రారు చేశారు. పీపీఈ కిట్ ధ‌ర రూ. 273కు మించ‌రాద‌ని తెలిపింది.

హెచ్ఆర్ సీటీ స్కాన్ – రూ. 1995, డిజిట‌ల్ ఎక్స్‌రే – రూ. 1300, ఐఎల్6 – రూ. 1300, డీ డైమ‌ర్ ప‌రీక్ష – రూ. 300, సీఆర్‌పీ – రూ. 500, ప్రొకాల్ సీతోసిన్ – రూ. 1400, ఫెరిటిన్ – రూ. 400, ఎల్ డీహెచ్ – రూ. 140గా ఖ‌రారు చేశారు. సాధార‌ణ అంబులెన్స్‌కు క‌నీస ఛార్జి రూ. 2 వేలు, కిలోమీట‌ర్‌కు రూ. 75, ఆక్సిజ‌న్ అంబులెన్స్‌కు క‌నీస ఛార్జి రూ. 3 వేలు, కిలోమీట‌ర్‌కు రూ. 125గా ఖ‌రారు చేశారు. కాగా ఈ ధరలను మించి వసూళ్లు చేసిన పక్షంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రైవేటు అసుపత్రులకు హెచ్చరికలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles