Croatia Legrad is selling homes at cheapest price క్రోనేషియాలోని లెగ్రాడ్ పట్టణంలో రూ. 12కే అందమైన ఇళ్లు.!

Croatia is selling homes that are cheaper than italian 1 homes

croatia travel, buy homes on croatia, places to visit in croatia, things to do in croatia, covid travel, Croatia Homes, croatia, legrad, second biggest population, kunas, dollars, conditions, Legrad Mayor, Ivan Sabolic

The latest to create news is Croatia. As per the news reports, Croatia will allow you to buy homes at unbelievable cheap prices. They are even cheaper than those famous €1homes! Of course, there are some conditions that one needs to fulfill.

క్రోనేషియాలోని లెగ్రాడ్ పట్టణంలో రూ. 12కే అందమైన ఇళ్లు.!

Posted: 06/23/2021 11:52 AM IST
Croatia is selling homes that are cheaper than italian 1 homes

ఇల్లు క‌ట్టి చూడు.. పెళ్లి చేసి చూడా అన్నారు పెద్దలు. ఎందుకంటే ఈ రెండు ఎంతో కష్టంతో కూడుకున్న పనులని పెద్దలు మాటల వెనుక పరమార్థం. భూమి ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఇంటిస్థలం కొనడమే కష్టం. ఇక సిమెంటు, ఇసుకతో పాటు మేస్త్రీల ఖర్చు కూడుకుని లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఈ క్రమంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టుకునేసరికి కేవలం ఇరవై లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. కనీసం ఇంటి స్థలం వున్నా రేకుల రూమ్ లు క‌ట్టుకునేందుకైనా 7 నుంచి 8 లక్షల రూపాయలను విధించాల్సిందే. అందుకనే పెద్దలు ఇల్లు కట్టడం అంత సులువు కాదని ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే క్రొయోషియాలోని ఓ న‌గ‌ర పాల‌క సంస్థ మాత్రం కేవ‌లం రూ.12కే ఒక ఇల్లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేస్తున్న‌ది. ఔనా నిజంగానా.? అంత తక్కువ ధరకు ఇళ్లు ఇస్తారా.? ఇది సాధ్యమేనా అని అంటారా.? కానీ ఇది ముమ్మాటికీ నిజం. క్రొయేషియా దేశంలోని లెగ్రాడ్ న‌గ‌రం గ‌త కొన్నేళ్లుగా ప్రజలు వలసలు పోతున్నారు. అన్ని విధాలుగా అభివృద్ది చెందిన నగరాలకు లెగ్రాడ్ పట్టణవాసులు వలసలు పోతుండటంతో.. ఒకప్పుడు జనసామర్థ్యంతో తులతూగిన పట్టణం ప్రస్తుతం జనం లేక వెలవెలబోతున్న‌ది. దీంతో లెగ్రాడ్‌ నగర పాలక సంస్థ స్థానికులను ఆకర్షించేందుకు పూనుకుంది. అత్యంత తక్కువ ధరకే అక్కడి ఇళ్లను కట్టబెట్టేందుకు అంగీకరిస్తూ ప్రజలు ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

లెగ్రాడ్ పట్టణాన్ని ప్రజలతో కళకళలాడేలా చేయాలని అక్క‌డి న‌గ‌ర పాల‌క సంస్థ‌ ఈ తరహా నిర్ణయాలను తీసుకుని.. నగరంలోని అత్యంత విలాస‌వంత‌మైన ఇళ్లను కేవ‌లం రూ.12కే విక్ర‌యిస్తున్న‌ది. అంతేకాదు, ఇల్లు కొనుగోలు చేసిన వారికి ఆ ఇంటి రిపేర్ కోసం లెగ్రాడ్ పాల‌క యంత్రాంగం రూ.3 లక్షల చొప్పున‌ ఆర్థికసాయం కూడా చేస్తుంది. ఔనా.. అని ఆశ్చర్యపోతున్నారా.? అయితే ఇక్కడ కొన్ని షరుతులను కూడా పెట్టింది లెగ్రాడ్ నగరపాలక సంస్థ. అవేంటి అంటే.. ఇళ్లు కొనే వారు ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉండాలి. అలాగే 40 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. అలాగే లెగ్రాడ్‌లో కనీసం 15 ఏళ్ళు నివసిస్తామని హామీ పత్రం రాసివ్వాలి. ఈ షరతులతో లెగ్రాడ్ పాల‌క‌మండ‌లి ఇప్పటివరకు 17 ఇళ్లను అమ్మినట్టు అక్క‌డి మేయర్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : croatia  legrad  second biggest population  kunas  dollars  conditions  Legrad Mayor  Ivan Sabolic  

Other Articles