"That's The Secret Behind Vaccination 'Record": Congress ‘‘కోటి మందికి కోవిడ్ వాక్సీన్ తో కేంద్రానికి నోబుల్ రావచ్చు’’

Congress alleges another ram temple land scam demands audit of transactions by sc

P Chidambaram, Covid vaccination, PM Modi, former Union Minister, central government, Congress, Guinness book, Nobel Prize for Medicine, National, politics

Hoard on Sunday, vaccinate on Monday and go back limping on Tuesday is how Congress leader P Chidambaram explained the working order behind the centre's "record" vaccinations in a day, in what was a three-step deconstruction and a searing takedown of the centre's vaccination policy.

‘‘కోటి మందికి కోవిడ్ వాక్సీన్ తో కేంద్రానికి నోబుల్ రావచ్చు’’: చిదంబరం వ్యంగం

Posted: 06/23/2021 01:42 PM IST
Congress alleges another ram temple land scam demands audit of transactions by sc

దేశంలో కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు ఉన్న ఏకైక మార్గం టీకాయేనని చెబుతున్న ప్రభుత్వం.. గత సోమవారం నుంచి వ్యాక్సిన్‌ విధానంలో సవరణను తీసుకువచ్చింది. ఇకపై దేశంలోని 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతీఒక్కరు.. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా వాక్సీన్ తీసుకోవచ్చునని అదేశాలు జారీచేసింది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తొలి రోజు రికార్డు స్థాయిలో జరిగిన టీకా పంపిణీ సుమారుగా కోటి మేర ప్రజానికానికి వాక్సీన్ ఇచ్చింది. ఆ మరుసటి రోజు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం చర్యలను తూర్పారబట్టాయి.

ఈ క్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ ఉంటే.. ఇలాంటి ఆశ్చర్యాలు సాధ్యమేనని ఎద్దేవా చేసిన ఆయన.. బహుశా దీనికి నోబెల్‌ బహుమతి కూడా ఇస్తారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్‌ డోసులు అందజేసేలా.. సవరించిన మార్గదర్శకాలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో సోమవారం దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 88లక్షలకు టీకాలు వేశారు.

అయితే, మంగళవారం మాత్రం 54లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ గణాంకాలపై చిదంబరం ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ఆదివారం కూడబెట్టి.. సోమవారం వ్యాక్సిన్‌ వేసి.. మంగళవారం తిరిగి ఎప్పటిలాంటి ఇబ్బందుల్లోకి రావడం - వ్యాక్సినేషన్‌లో ‘ప్రపంచ రికార్డు’ వెనుక రహస్యమిదే. ఈ ‘ఫీట్‌’కు కచ్చితంగా గిన్నిస్‌బుక్‌లో చోటు లభిస్తుందనిపిస్తోంది. ఎవరికి తెలుసు.. బహుశా మోదీ ప్రభుత్వానికి వైద్యశాస్త్రంలో నోబెల్‌ బుహుమతి కూడా ఇవ్వొచ్చు. ‘మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే’ అనేదాన్ని ఇప్పుడు ‘మోదీ ఉంటే అద్భుతాలే’ అనాలేమో.!!’’ అంటూ ఆయన విమర్శల వర్షం కురిపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles