Microsoft names Satya Nadella as chairman సత్యా నాదేళ్లను చైర్మన్ గా ప్రకటించిన మైక్రోసాప్ట్.!

Satya nadella gets more power appointed as microsoft chairman

Microsoft Corp., Chief Executive Officer, Satya Nadella, Microsoft chairman, world's largest software maker, John Thompson, lead independent director

Microsoft Corp. named Chief Executive Officer Satya Nadella as board chairman, strengthening his influence at the world's largest software maker after more than seven years as the top executive. Nadella, 53, succeeds John Thompson, who will return to the role of lead independent director, a position he held before being named chairman in 2014, Microsoft said.

సీఈఓ సత్యా నాదేళ్లను చైర్మన్ గా ఎంపిక చేసిన మైక్రోసాప్ట్.!

Posted: 06/17/2021 12:03 PM IST
Satya nadella gets more power appointed as microsoft chairman

మైక్రోసాఫ్ట్ సంస్థ ఆసక్తి కలిగించే నిర్ణయం తీసుకుంది. తమ సంస్థకు గత ఏడేళ్లుగా సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యనాదెళ్ల సంస్థ నూతన చైర్మన్ గా ఎంపిక చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. సత్యా నాదేళ్ల ఎంపిక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఏకగ్రీవంగా తీసుకుందని పేర్కోంది. బోర్డ్ ఎలక్షన్ లో జాన్ థామ్సన్ స్థానంలో కొత్త చైర్మన్ గా సత్యనాదెళ్లను ఎన్నుకున్నారు. స్టీవ్‌ బల్లెమర్‌ నుంచి 2014 ఫిబ్రవరిలో సీఈఓ బాధ్యతలు అందుకున్నారు సత్యనాదెళ్ల. మైక్రోసాఫ్ట్ వ్యాపార సామాజ్రాన్నివిస్తరించడంలో కీలక పాత్ర పోషించారు.

సీఈఓకు ముందు ఆయన మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్ ప్రైజెస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. కంపెనీ కంప్యూటింగ్ ప్లాట్ ఫాంలను నిర్మించడం సహా అనేక రోల్స్ విజయవంతంగా నిర్వర్తించారు. లింక్ డిన్‌, న్యూయాన్స్‌ కమ్యూనికేషన్స్‌, జెనిమిక్స్‌ వంటి సంస్థల కొనుగోలులో నాదెళ్ల కీలకంగా వ్యవహరించారు. ఆపిల్, గూగుల్ నేతృత్వంలోని కొత్త టెక్ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ ను పోటీగా నిలిపారు. నాదెళ్ల మైక్రోసాఫ్ట్ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన సమయంలో టెక్నాలజీ దిగ్గజం డైనోసార్ అవుతుందని కొందరు భయపడ్డారు.

1975లో స్థాపించిన ఈ సంస్థకు మరింత పవర్ అందించిన ఘనత నాదెళ్లకు దక్కుతుంది. మైక్రోసాఫ్ట్ వచ్చే వారమే తన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ న్యూ జనరేషన్ ఆవిష్కరించనుంది. ప్రపంచంలోని డెస్క్ టాప్ కంప్యూటర్లలో దాదాపు మూడొంతుల కంప్యూటర్లకు పవర్ ఇస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 1976 నుంచి బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మైక్రోసాఫ్ట్ మూడో సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టాడు. ప్రపంచ దిగ్గజ సంస్థలో ఇలాంటి గొప్ప అవకాశం భారతీయుడుకి.. అందులోనూ మన తెలుగువాడికి ప్రపంచ ప్రఖ్యాతి దక్కడం గర్వించదగిన విషయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles